మహబూబ్‌నగర్: శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15 వరకు 30 పోలీస్ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు సోమవారం జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం, మైకులు, సౌండ్ బాక్సులు ఉపయోగించడం, ప్రజలు గుంపులుగా కూడగట్టడం చట్టరీత్యా నేరమవుతుందని ఆమె తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. జిల్లాలోని ప్రజలంతా శాంతియుత వాతావరణంపై పోలీస్‌కు సహకరించాలని ఆమె కోరారు.