ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియార్ ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 42 బైక్లు, ఏడు ఆటోలతో పాటు, పది వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల సంచారంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పి విష్ణు ఎస్ వారియార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.