రక్తం చిందేలా చావబాదిన ఎస్ఐ

మన తెలంగాణ/సిటీబ్యూరో: యువకుల మధ్య జరిగిన ఘర్షణను నివారించాల్సిన పోలీసులు అది మరిచి యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి మరీ చితకబాదిన సంఘటన నగరంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తుకారం గేట్ సమీపంలో కొందరు యువకుల మధ్య గొడవ జరుగుతోందని సమచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఘర్షణ పడుతున్న యువకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అందులో ఉన్న సాయిగౌడ్ అనే యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ చితకబాదడంతో నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. […] The post రక్తం చిందేలా చావబాదిన ఎస్ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/సిటీబ్యూరో: యువకుల మధ్య జరిగిన ఘర్షణను నివారించాల్సిన పోలీసులు అది మరిచి యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి మరీ చితకబాదిన సంఘటన నగరంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తుకారం గేట్ సమీపంలో కొందరు యువకుల మధ్య గొడవ జరుగుతోందని సమచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఘర్షణ పడుతున్న యువకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అందులో ఉన్న సాయిగౌడ్ అనే యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ చితకబాదడంతో నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న సాయిగౌడ్ స్నేహితులు పోలీసుల ఘనకార్యాన్ని వీడియో తీయడంతో అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్సై రామ్‌లాల్, కానిస్టేబుల్ నాయక్ కొట్టారని, తనకు మద్యం తాగే అలవాటు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగరేట్ వివాదంలో సదరు యువకుడి పట్ల పోలీసులు అతిగా స్పందించి రక్తం వచ్చే విధంగా కొట్టారని తెలిసింది.

The post రక్తం చిందేలా చావబాదిన ఎస్ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: