రేవ్ పార్టీలో కొత్తకోణం.. యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం..

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలో కొత్త కోణం వేలుగుచూసింది. పబ్ ను బుక్ చేసుకున్న ఓ ఫార్మా కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు సమాచారం అందుకొని దాడులు చేశారు. గుర్తించారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడ్డాయి. ప్రతి ఏటా ఇలా రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు, 22 మంది యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం కోసం తెచ్చారని.. పట్టుబడ్డ యువతులంతా ఎపిలోని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సినీమా ఛాన్సుల కోసం, ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చిన యువతులను టార్గెట్ చేసి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు. కాగా, ఫార్మా కంపెనీ పేరును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Police attack on A Secrete Pub in Jublee Hills

The post రేవ్ పార్టీలో కొత్తకోణం.. యువతులతో నగ్న నృత్యాలు, వ్యభిచారం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.