నిన్న నీరవ్.. నేడు భూషణ్

    పిఎన్‌బికి రూ.3,800 కోట్ల రుణమోసం విదేశీ బ్రాంచ్‌ల్లోనూ దండుకున్న అప్పులు న్యూఢిల్లీ : భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బిపిఎస్‌ఎల్) వారు రూ, 3,800 కోట్ల మోసానికి పాల్పడి నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శనివారం తెలిపింది. తమ బ్యాంకు నుంచి ఈ మేరకు తీసుకున్న రుణాలను దారి మళ్లించిన వైనాన్ని కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పిఎన్‌బి తెలిపింది. ఈ మోసం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( […] The post నిన్న నీరవ్.. నేడు భూషణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

పిఎన్‌బికి రూ.3,800 కోట్ల రుణమోసం
విదేశీ బ్రాంచ్‌ల్లోనూ దండుకున్న అప్పులు

న్యూఢిల్లీ : భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బిపిఎస్‌ఎల్) వారు రూ, 3,800 కోట్ల మోసానికి పాల్పడి నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శనివారం తెలిపింది. తమ బ్యాంకు నుంచి ఈ మేరకు తీసుకున్న రుణాలను దారి మళ్లించిన వైనాన్ని కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పిఎన్‌బి తెలిపింది. ఈ మోసం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ)కి నివేదించినట్లు వెల్లడించారు. బ్యాంకులను వివిధ సంస్థలు ప్రముఖ వ్యక్తులు మోసగిస్తున్న ఘటనల క్రమంలో ఇప్పుడు బిపిఎస్‌ఎల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భారీ స్థాయి రుణాలు తీసుకుని విదేశాలకు ఉడాయించి ఇదే బ్యాంకుకు చిక్కులు తెచ్చిపెట్టారు.

ఢిల్లీకి చెందిన భూషణ్ కంపెనీ వారు రుణ నిధులను దుర్వినియోగపర్చి, కంపెనీ ఖాతా పుస్తకాలలో తప్పుడు లెక్కలతో తమ బ్యాంక్‌కు చెందిన ఇతర బ్రాంచ్‌ల నుంచి కూడా రుణాలను పొందినట్లుగా గుర్తించారు. పిఎన్‌బి వారు జరిపిన ఆడిట్ దర్యాప్తు, ఫోరెన్సిక్ పరిశీలనలో మోసం సంగతి వెల్లడైంది. సిబిఐ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించితనంత తానుగా స్పందించి భూషణ్ కంపెనీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కంపెనీపైనా, డైరెక్టర్లపైనా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల్లో బ్యాంకింగ్ వ్యవస్థ నిధుల దారిమళ్లింపు ద్వారా నష్టం కల్గించినట్లు పేర్కొన్నారు. జరిగిన మోసాన్ని గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టిన పిఎన్‌బి ఆర్‌బిఐకి పంపించిన నివేదనలో రూ 3,805.15 కోట్ల మేర అక్రమాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత దశలో ఈ ఉదంతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) పరిశీలనలో కూడా ఉందని, కేసు పురోగతిలో ఉన్నందున రికవరీ సముచిత స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నట్లు పిఎన్‌బి వర్గాలు తెలిపాయి.

ఇలాంటి ఘటనల దశలో పాటించాల్సిన నిర్ణీత నియామావళి పరిధిలో సదరు సంస్థకు చెందిన రూ 1,932.47 కోట్ల వివరాలను ఆర్‌బిఐకి తెలియచేసినట్లు పిఎన్‌బి తెలిపింది. అయితే ఇప్పటికే భూషణ్ సంస్థ దివాళా పరిస్థితి ఉంది. సంస్థ తీసుకున్న రుణాలు మొండిబకాయిలుగా మారాయి. ఈ దశలోనే భారీ రుణ మోసాల గురించి వెల్లడైనా రికవరీపై సదరు బ్యాంకు నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ సంస్థ వారు పిఎన్‌బి దేశీయ బ్యాంకు శాఖ నుంచే కాకుండా ఈ బ్యాంకుకు చెందిన విదేశీ శాఖల నుంచి కూడా రుణాలు పొందినట్లు వెల్లడైంది. అంతర్జాతీయ స్థాయిలో భూషణ్ వారు పొందిన రుణాల మొత్తం రూ. 600 కోట్ల పై చిలుకు వరకూ ఉంటుంది.

ఇందులో 345.74 కోట్లు అంటే 49.71మిలియన్ డాలర్ల స్థాయిలో దుబాయ్ బ్రాంచి నుంచి, హాంగ్‌కాంగ్ బ్రాంచి నుంచి రూ 267.90 కోట్లు అంటే 38 మిలియన్ డాలర్ల వరకూ రుణాలను పొందినట్లు వెల్లడైంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఈ బ్యాంకులో రెండు బిలియన్ డాలర్లు అంటే రూ 13,000 కోట్ల మేర భారీ స్థాయి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఉదంతం 2018 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. ఆయన పిఎన్‌బి శాఖ నుంచి తప్పుడు తప్పుడు హామీ పత్రాలు (ఎల్‌ఒయు)లను సమీకరించుకుని, కంపెనీకి సరైన రికార్డును చిత్రీకరించుకుని భారతదేశానికి చెందిన ఇతర బ్యాంక్‌ల ఓవర్సీస్ బ్రాంచ్‌ల నుంచి భారీ స్థాయి రుణాలు పొందారు. ఈ కేసుపై సిబిఐ, ఇడి ఇతర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న దర్యాప్తు కీలక స్థాయికి చేరుకుని, కోర్టు విచారణల దశల్లో ఉంది.

PNB detects Rs 3,805 crore fraud

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిన్న నీరవ్.. నేడు భూషణ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.