రాజీవ్‌పై రాద్ధాంతం!

  ప్రధాని పదవిలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ యుద్ధనౌకను విహారయాత్రకు వాడుకున్నారు. అంతేకాదు, యుద్ధనౌకపైకి తన విదేశీ మిత్రుడిని తీసుకువెళ్ళారు. రాజీవ్ గాంధీ సెలవులు గడపడానికి ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌకను ఉపయోగించుకున్నారు ఇవి ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలు. దీనివల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 1989 ఎన్నికలా లేక 2019 ఎన్నికలా అర్థంకాని ఒక అయోమయం ఇప్పుడు అలుముకుంది. రాజీవ్ గాంధీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పుడు రాజీవ్ గాంధీతో […] The post రాజీవ్‌పై రాద్ధాంతం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రధాని పదవిలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ యుద్ధనౌకను విహారయాత్రకు వాడుకున్నారు. అంతేకాదు, యుద్ధనౌకపైకి తన విదేశీ మిత్రుడిని తీసుకువెళ్ళారు. రాజీవ్ గాంధీ సెలవులు గడపడానికి ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌకను ఉపయోగించుకున్నారు ఇవి ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలు. దీనివల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 1989 ఎన్నికలా లేక 2019 ఎన్నికలా అర్థంకాని ఒక అయోమయం ఇప్పుడు అలుముకుంది. రాజీవ్ గాంధీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పుడు రాజీవ్ గాంధీతో తలపడుతున్నారా అనే వాతావరణం ఏర్పడింది. మోడీ చేసిన ఆరోపణలను, చెప్పిన మాటలను సీనియర్ నౌకాదళాధికారులు, అప్పట్లో నౌకాదళంలో కీలక పదవుల్లో ఉన్నవారు నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆడ్మిరల్ రాందాస్ అప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పారు. విహారయాత్రకు రాజీవ్ గాంధీ యుద్ధనౌకను వాడుకున్నారని చెప్పడం పూర్తి అబద్ధమని చెప్పారు.

ప్రధాని మోడీ చేసిన ఆరోపణ మూడు దశాబ్దాల క్రితం నాటి సంఘటనకు సంబంధించినది. రాజీవ్ గాంధీ ఎలాంటి విదేశీయుడిని యుద్ధనౌకపైకి తీసుకురాలేదని అప్పటి నౌకాదళాధికారులు స్పష్టం చేశారు. మొన్న మూడేళ్ళ క్రితం జరిగిన సంఘటన అలాంటిది కాదు. ఇందులో స్పష్టంగా రుజువులతో సహా విదేశీయుడిని యుద్ధనౌకపై ఆహ్వానించి సంబరాలు జరుపుకున్నారు. మోడీ ప్రధానిగా ఉన్నకాలంలోనే ఇది జరిగింది. ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో ఇదంతా జరగలేదా? జరగలేదని ఖండించడం ఎవరికీ సాధ్యం కాదు.

ఫిబ్రవరి 2016లో కెనడా పౌరుడైన కెనడా పాస్ పోర్టున్న అక్షయ్ కుమార్ ఐఎన్‌ఎస్ సుమిత్రా యుద్ధనౌకపై వెళ్ళలేదా? యుద్ధనౌకపై పార్టీ చేసుకోలేదా? స్వయంగా అక్షయ్ కుమార్ ఈ పార్టీ ఫోటోను ట్వీట్ చేశాడు. అప్పుడు ప్రధాని మోడీ కూడా యుద్ధనౌకపైనే ఉన్నారు. అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ నా కొడుకు చెవి మెలిపెడుతూ ప్రేమగా గుడ్‌బోయ్ అని ప్రధాని చెప్పడం కన్నా తండ్రికి గర్వకారణం ఏముంటుంది అని ట్వీట్ చేశాడు. ఇదంతా యుద్ధనౌకపైనే విశాఖపట్నంలో జరిగింది. గత పదిహేను సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మిలిటరీ విన్యాసాల సందర్భంగా యుద్ధనౌకపై ఈ పార్టీ జరిగింది. ఈ విదేశీయుడితో ఆ పార్టీ గురించి ఎవరూ మాట్లాడరెందుకని?

ఇప్పుడు అక్షయ్ కుమార్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోడీతో రాజకీయేతర ఇంటర్వ్యూ చేశాడు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాజకీయేతర ఇంటర్వ్యూ అనేది ఉంటుందా? సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని నిలదీసి ప్రశ్నించారు నెటిజన్లు. దీనిపై చాలా మంది అనేక జోకులు వేసుకున్నారు. మమతా బెనర్జీ తనకు మిఠాయిలు, కుర్తాలు కానుకగా పంపిస్తారని మోడీ చెప్పింది ఈ ఇంటర్వ్యూలోనే. దానికి జవాబుగా మమతా బెనర్జీ మిఠాయిల్లో గులక రాళ్ళు వేసి పంపిస్తాం అని చెప్పారు.

అక్షయ్ కుమార్‌కు భారతదేశ పౌరసత్వం ఉందా, కెనడా పౌరసత్వం ఉందా, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు భారతీయులకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పాలా? ఇలాంటి అనేక ప్రశ్నలు పలువురు సంధించడం ప్రారంభించారు. కాని భారత ప్రధాన మీడియాలో ఈ వివాదం గురించి వార్తలే కనబడలేదు. అక్షయ్ కుమార్‌కు మద్దతుగా కేంద్రమంత్రి వర్గమే ఉంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేస్తూ మీ దేశభక్తిని ఎవ్వరూ ప్రశ్నించలేరని కితాబు ఇచ్చేశారు. భారత్ కే వీర్ ప్రోగ్రామ్ ద్వారా మీరు భారత అమర సైనికుల కోసం విరాళాలు సేకరించడాన్ని మరిచిపోలేం అన్నారు. అనుపమ్ ఖేర్ కూడా అక్షయ్ కుమార్‌కు మద్దతు పలికాడు. వీళ్ళందరికీ అక్షయ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

యుద్ధనౌకపై పార్టీ, అక్షయ్ కుమార్ సెల్ఫీలు తీసుకోవడం, భారత సైనికదళాల ప్రధానాధికారి స్వయంగా ఆ సెల్ఫీల్లో ఉండడం ఇదంతా సైన్యానికి కూడా నచ్చలేదు. దీనిపై చాలా విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అంతర్జాతీయ మిలిటరీ విన్యాసాలు జరుగుతున్నప్పుడు ఒక విదేశీ పౌరుడు భారత యుద్ధనౌకపై ఎలా ఉన్నాడని మాజీ నౌకాదళాధికారి అడ్మిరల్ విష్ణు భగత్ ప్రశ్నించారు. నిజానికి మోడీ కూడా మొన్న అడిగిన ప్రశ్న అదే. రాజీవ్ గాంధీ యుద్ధనౌకపై విదేశీ పౌరుడిని తీసుకెళ్ళడం ద్వారా దేశ భద్రతను ప్రమాదంలో పడవేయలేదా అని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ అప్పట్లో అలాంటి పనేమీ చేయలేదని, విదేశీయుడిని తీసుకువెళ్ళ లేదని నౌకదళాధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో ఐఎన్‌ఎస్ విరాట్ కమాండర్, నౌకాదళ ప్రధానాధికారి అందరూ ఈ మాటలు అబద్ధమని చెప్పారు. ఆడ్మిరల్ రాందాస్ చాలా స్పష్టంగా రాజీవ్ గాంధీ అధికారిక పర్యటనలో భాగంగా తన భార్యతో సహా ఐఎన్‌ఎస్ విరాట్ పైకి వచ్చారు. ఆయనతో పాటు విదేశీయులు ఎవ్వరు లేరు అని ప్రకటించారు. కాని విదేశీయుడు అక్షయ్ కుమార్ ఐఎన్‌ఎస్ సుమిత్రా వంటి యుద్ధనౌకపై ఎలా వచ్చారు.

అది కూడా భారత ప్రధాని మోడీ స్వయంగా యుద్ధనౌకపై ఉన్నప్పుడు ఈ విదేశీయుడిని ఎలా తీసుకువచ్చారు. భారత భద్రతను ప్రమాదంలో పడవేయడం లేదా? ఈ ప్రశ్నలు అడిగే వారెవ్వరు ఉండరన్నది బిజెపి నమ్మకం. ఆ నమ్మకం వల్లనే రాజీవ్ గాంధీ అవినీతిపరుడు నెంబర్ వన్‌గా చనిపోయారని అత్యంత హీనమైన వ్యాఖ్య ప్రధాని చేయగలిగారు. ప్రధాని మరణించింది ఉగ్రదాడిలో. అత్యంత భయంకరమైన ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి మరణాన్ని, ఒక దివంగత ప్రధాని మరణాన్ని ఎద్దేవా చేయడం ఎలాంటి సంస్కారం మరో వాస్తవమేమంటే, బోఫోర్సు కుంభకోణంలో రాజీవ్ గాంధీపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విచారణలు జరిగాయి.

ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కోర్టు రాజీవ్ గాంధీపై కేసును కొట్టేసింది. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం కూడా లేదని వ్యాఖ్యానించింది. అప్పుడు అరుణ్ జైట్లీ అడిషనల్ సోలిసిటర్ జనరల్. కోర్టు తీర్పుపై కనీసం అప్పీలు కూడా చేయలేదు. ఇవన్నీ మోడీకి తెలియవా? కోర్టు కేసు కొట్టేసిన తర్వాత ఈ మాటలు ఎలా చెబుతున్నారు. కోర్టు తీర్పులకు కూడా మర్యాద ఇవ్వారా? ఏది ఏమైనా ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో సంస్కారం, సంయమనం అంతరించిన విలువలుగా మారిపోయాయనిపిస్తోంది.

                                                                                                                      – ది సిటిజన్ బ్యూరో
PM Rajiv Gandhi used Navy warships for a private holiday

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాజీవ్‌పై రాద్ధాంతం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: