బిజెపి మూలస్తంభం అద్వానీ

LK Advani

 

92వ పుట్టిన రోజున ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : బిజెపిలో అత్యంత సీనియర్ నేత ఎల్‌కె అద్వానీకి ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ శుక్రవారం 92వ సంవత్సరంలోకి ప్రవేశించారు. బిజెపిని శక్తివంతం చేయడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని మోడీ కొనియాడారు. భారత రాజకీయాలలో బిజెపిని ప్రాబల్య ధృవంగా మల్చడంలో ఆయన పాత్ర విశిష్టమైనదని తెలిపారు. ప్రధాని మోడీ శుక్రవారం అద్వా నీ నివాసానికి వెళ్లి, ఆయనను అభినందించారు. సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీ పడని నేత అని కితాబు ఇచ్చారు. దేశ పౌరులకు మరింత సాధికారతను కల్పించడంలో ఆయన కీలక అనితర పాత్ర పోషించారని, ఈ సేవలు కలకాలం గుర్తుంటాయని తెలిపారు.

దశాబ్దాల తరబడి అద్వానీ సల్పిన కృషి ఫలితంగానే బిజెపి ఇప్పుడు ఈ దశకు చేరుకుందని చెప్పారు. నిస్వార్థ కార్యకర్తగా అద్వానీ అందించిన సేవలు ఆయనను తిరుగులేని నేతగా మలిచాయని ట్విట్టర్‌లో తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశలో ఆయన అలుపెరుగని పోరు సల్పినట్లు, ఎక్కడా సిద్ధాంతాలను సడలినివ్వలేదని అమిత్ షా ప్రశంసించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఇతర ప్రముఖులు కూడా అద్వానీని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అవిభక్త భారత ఉపఖండంలోని కరాచీలో 1927లో అద్వానీ జన్మించారు.

PM Narendra Modi wishes LK Advani happy birthday

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిజెపి మూలస్తంభం అద్వానీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.