కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ

pm-modi

న్యూఢిల్లీ:  కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ… మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. దేశప్రజలంతా కరోనాపై పోరాటం చేస్తున్నారు. కరోనాపై యుద్ధానికి కొత్త దారులను అన్వేషిస్తున్నాం. అన్ని రంగాలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వల్ల బాగా ఇబ్బంది పడింది వలసకూలీలే.

యావత్ దేశం వలసకూలీలకు అండగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలసకూలీలకు అండగా నిలిచాయి. ఆత్మనిర్భర భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. రైల్వే సిబ్బంది కూడా కోవిడ్ వారియర్స్. కోవిడ్ వీరులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రపంచం మన ఆయుర్వేద, యోగ గురించి తెలుసుకుంటున్నాయి. యోగా మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆయుష్మాన్ భారత్ విప్లవాత్మక పథకం. నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారింది. ఈ పథకం ద్వారా కోటిమంది నిరుపేద లబ్ధిదారుల్లో 80 శాతం గ్రామీణులే ఉన్నారు.

కోవిడ్-19 ఎదుర్కోడానికి ప్రపంచం దగ్గర ఇప్పటి వరకు ఏలాంటి సమాధానం లేదు. మాస్కులు తయారు చేసి మహిళా సంఘాలు చేయూతనిచ్చాయి. వలసకూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నాం. కరోనా సమయంలో పేదలు, కూలీలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. దేశ విద్యా విధానంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేశారు. కరోనా కట్టడి కోసం అన్ని రంగాల్లోని ప్రజలు విశేష కృషి చేస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.