ఎస్‌సిఓలో మోడీ జీ జిన్‌పింగ్ భేటీ

బీజింగ్: వచ్చేవారం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేన్ (ఎస్‌సిఓ) వచ్చే వారం నిర్వహించబోయే శిఖరాగ్ర సభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమవుతారు. ఇండియాలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరువురు నాయకులూ సమావేశం కావడం ఇదే మొదటిసారి అని భారత రాయబారి విక్రం మిశ్రీ గురువారం ప్రకటించారు. ‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ చైనాలు పరిణతి చెందిన, సుస్థిరమైన సంబంధాల్ని పెంపొందించుకోగలిగాయి. గత ఏడాది ప్రధాని […] The post ఎస్‌సిఓలో మోడీ జీ జిన్‌పింగ్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


బీజింగ్: వచ్చేవారం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేన్ (ఎస్‌సిఓ) వచ్చే వారం నిర్వహించబోయే శిఖరాగ్ర సభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమవుతారు. ఇండియాలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరువురు నాయకులూ సమావేశం కావడం ఇదే మొదటిసారి అని భారత రాయబారి విక్రం మిశ్రీ గురువారం ప్రకటించారు. ‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ చైనాలు పరిణతి చెందిన, సుస్థిరమైన సంబంధాల్ని పెంపొందించుకోగలిగాయి. గత ఏడాది ప్రధాని మోడీ, అధ్యక్షుడు జీ మధ్య ఊహాన్‌లో జరిగిన అనధికారిక శిఖరాగ్ర సమావేశం ఓ మైలు రాయి. మన సంబంధాల్నీ మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో ఇదొక సాధనం అవుతుంది’ అని మిశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ డెఝావులో ఊచెంగ్ కౌంటీ వద్ద భారత్‌కు చెందిన సింథైట్ ఇండస్ట్రీస్ మూడో ఉత్పత్తి దశను ప్రారంభిస్తూ మిశ్రీ ప్రసంగించారు.
ఎస్‌సిఓలో మోడీ, ఇమ్రాన్ కలుసుకోరు
న్యూఢిల్లీ: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సభ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రతిపాదన ఏదీ లేదని విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ (ఎంఇఎ) గురువారం తెలిపింది.

PM Modi Xi Jinping to Meet  at SCO

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్‌సిఓలో మోడీ జీ జిన్‌పింగ్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: