మోడీ ప్రసంగానికి అంతా రెడీ

 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయబోతున్నారు. ఆగస్ట్ 15న ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగించడం వరసగా ఇది ఆరోసారి అవుతుంది. జమ్మూకశ్మీర్ విషయంలో ఆయన ఇటీవల తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం దగ్గర్నుంచి దేశ ఆర్థిక పరిస్థితి వరకు అనేక అంశాల్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించవచ్చని అనుకుంటున్నారు. ప్రజలిచ్చిన భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం లో మోడీ చేయబోతున్న మొదటి ప్రసంగం ఇది. తన ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్ని వివరించేందుకు ఈ సందర్భాన్ని ఆయన వాడుకుంటూ వస్తున్నారు. అలాగే తన పాలనలో దేశం ఏవిధం గా అభివృద్ధి చెందిందనే అంశానికి ఈ ప్రసంగం లో అధిక ప్రాధాన్యమిస్తారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టిక ర్ 370 రద్దు ఈసారి ఆయన ప్రసంగంలో అందరినీ ఆకర్షించే ముఖ్యాంశమవుతుందని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. 2014 నాటి కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి మోడీ అధికారంలో కి వచ్చారు కనుక ఈసారి ప్రసంగంలో కొన్ని సంస్కరణల్ని లేదా వివిధ వర్గాల వారికి రాయితీల్ని ప్రకటించే అవకాశం ఉంది. గతంలో వాజ్‌పేయి కూడా ఆరుసార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఆయన తర్వాత ఇప్పుడు మోడీ బిజెపి రెండో వ్యక్తి అవుతారు.
పోలీసుల కొత్తరకం భద్రతా ఏర్పాటు
ఈసారి ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు నూతన విధానంలో భద్రతా చర్య లు చేపడుతున్నారు. బ్రహాండంగా జరిగే బహిరంగ సభకు ఎవరెవరు వచ్చారో గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ (ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్)ను ఉపయోగిస్తున్నామని అధికారులు బుధవారం తెలిపారు. భద్రతావలయం వివిధ అంచెల్లో ఉంటుంది. స్వాట్ కమెండోలు, ఎన్‌ఎస్‌జి స్నిప్పర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నా రు. ఆర్మీ, పారామిలిటరీ దళాలు, 20,000 మంది ఢిల్లీ పోలీసులను నియోగిస్తున్నారు.

PM Modi to be Addressed from Red Fort on August 15

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోడీ ప్రసంగానికి అంతా రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.