దమ్ముంటే రుజువు చేయండి

అవినీతిపై ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ సవాలు ఎన్నికల్లో గెలవలేమనే నన్ను తిడుతున్నారు బక్సర్/న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవలేమని తెలిసిపోయినందునే తనను తిట్టడానికి ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మండి పడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆరు రౌండ్ల తర్వాత తాము గెలవలేమని ప్రతిపక్షాలకు తేటతెల్లమైందని, అందుకే ప్రతిపక్ష నేతలు మోడీని తిట్టడానికి పోటీ ఎక్కువయిందని బీహార్‌లోని బక్సర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మండి పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన మరో బహిరంగ సభలో ప్రధాని […] The post దమ్ముంటే రుజువు చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అవినీతిపై ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ సవాలు

ఎన్నికల్లో గెలవలేమనే నన్ను తిడుతున్నారు

బక్సర్/న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవలేమని తెలిసిపోయినందునే తనను తిట్టడానికి ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మండి పడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆరు రౌండ్ల తర్వాత తాము గెలవలేమని ప్రతిపక్షాలకు తేటతెల్లమైందని, అందుకే ప్రతిపక్ష నేతలు మోడీని తిట్టడానికి పోటీ ఎక్కువయిందని బీహార్‌లోని బక్సర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మండి పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన మరో బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, దమ్ముంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని ప్రతిపక్షాలకు బహిరంగ సవాలు విసిరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఇరవై సంవత్సరాలు నిబద్ధతతో పని చేశానని, ఏ అవినీతి కుంభకోణంలోనైనా తన ప్రమేయం ఉంటే విపక్షాలు రుజువు చేయాలని సవాలు విసిరారు.‘మహా కూటమి నేతలకు నేను బహిరంగ సవాలు విసురుతున్నాను. వారికి దమ్ముంటే నాపై ఆరోపణలు చేయకుండా నా సవాలును స్వీకరించాలి. నేను అప్రకటిత ఆస్తులు కలిగి ఉన్నా.. ఫామ్ హౌస్‌లుకానీ, షాపింగ్ కాంప్లెక్స్‌లు కానీ, విదేశీ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నా వాటిని చూపించాలని సవాలు విసురుతున్నాను. కోట్లాది రూపాయల విలువైన బంగళాలు కానీ, హై ఎండ్ కార్లు కానీ, కోట్లకు కోట్ల సొమ్ములు కానీ ఉంటే చూపించండి’ అని మోడీ తీవ్ర స్వరంతో అన్నారు.
కాశీ నా ప్రపంచం, ప్రేరణ
వారణాసినుంచి మరోసారి లోక్‌సభకు ఎన్నిక కావాలని ప్రధాని నరేంద్ర మోడీ తనను తాను ‘కాశీ వాసి’గా అభివర్ణించుకున్నారు. తన విజయానికి వారణాసి ప్రజలంతా ఆశీస్సులు అందించాలని పిలుపునిచ్చారు. వారణాసితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ తన వెబ్‌సైట్ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. ‘ ఎవరైనా సరే ఒక్క సారి వారణాసికి వస్తే ఆ నగరంతో మమేకమవుతారు. గత అయిదేళ్లుగా నేను అనుక్షణం అలాంటి అనుభూతినే పొందాను. నన్ను నేను మలుచుకోవడంలోను, రాజకీయ, ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించుకోవడంలోను నాపై కాశీ ప్రభావం ఎంతో ఉంది’ అని పేర్కొన్నారు. కాశీ కేవలం తన ప్రపంచం కాదని, మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక పరంగా తనకు స్ఫూర్తి అని, కాశీవాసులు తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారని మోడీ అన్నారు. గత అయిదేళ్లలో కాశీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చూసి గర్విస్తున్నానని, దేశానికే కాశీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తన హయాంలో కాశీలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. హైవే, రైల్వేస్టేషన్, గంగానదిపై మల్లీ మోడల్ నిర్మాణాలను ఆయన ఉదహరించారు. అయిదేళ్లుగా చాలా పనులే చేసినా ఇంకా చేయాల్సింది చాలానే ఉందని, కలిసి కట్టుగా మనం అందుకు కృషి చేద్దామని అన్నారు. ‘ కాశీ వాసులు ప్రతి ఒక్కరూ మోడీ కోసం మోడీ లాగా ఎన్నికల్లో పోరాడుతున్నారని నాకు తెలుసు’ అని అంటూ, పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ ఎండ వేడిమి పెరగక ముందే ఓటింగ్ వేసేందుకు ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని, సరికొత్త రికార్డు సృష్టించాలని సందేశంలో పిలుపునిచ్చారు.

PM Modi fires on Opposition

The post దమ్ముంటే రుజువు చేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: