ఉమ్మడి సవాలు ఉగ్రవాదమే

  జట్టుగా తిప్పికొట్టాలి శ్రీలంకలో ప్రధాని మోడీ.. సిరిసేనతో చర్చలు కొలంబో: రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తమ రెండో విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శ్రీలంక చేరుకున్నారు. ఆదివారం ఇక్కడ శ్రీలంక అగ్రనాయకులతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదం భారత్, శ్రీలంకలకు ఉమ్మడి సవాలుగా మారిందని, దీనిని కలిసికట్టుగానే ఎదుర్కొవల్సి ఉందని మోడీ స్పష్టం చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పది రోజుల వ్యవధిలోనే మోడీ విదేశీ పర్యటన చేపట్టారు. పాకిస్థాన్ మినహా పొరుగుదేశాలకు […] The post ఉమ్మడి సవాలు ఉగ్రవాదమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జట్టుగా తిప్పికొట్టాలి
శ్రీలంకలో ప్రధాని మోడీ.. సిరిసేనతో చర్చలు

కొలంబో: రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తమ రెండో విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శ్రీలంక చేరుకున్నారు. ఆదివారం ఇక్కడ శ్రీలంక అగ్రనాయకులతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదం భారత్, శ్రీలంకలకు ఉమ్మడి సవాలుగా మారిందని, దీనిని కలిసికట్టుగానే ఎదుర్కొవల్సి ఉందని మోడీ స్పష్టం చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పది రోజుల వ్యవధిలోనే మోడీ విదేశీ పర్యటన చేపట్టారు. పాకిస్థాన్ మినహా పొరుగుదేశాలకు ప్రాధాన్యత విధానంతో మోడీ ఇప్పుడు శ్రీలంకకు వచ్చారు. శ్రీలంకలో అత్యంత భయానక ఈస్టర్ ఉగ్రవాద దాడి తరువాత ఒక విదేశీ నేత ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ దాడులు, అనంతర పరిణామాలలో శ్రీలంకకు భారత్ అండగా ఉంటుందని ప్రకటించుకోవడానికే మోడీ శ్రీలంక పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తాను దేశాధ్యక్షులు మైత్రిపాల సిరిసేనను కలిసినట్లు, పలు కీలక అంశాలను, ప్రత్యేకించి ఉగ్రవాదం గురించి ఆయనతో చర్చించినట్లు ఆ తరువాత మోడీ ట్వీట్ వెలువరించారు.

ఉగ్రవాదం అందరిని కలవరపరుస్తున్న జటిల సమస్యగా మారింది. దీనిని అణచివేసేందుకు సరిహద్దులకు అతీతంగా అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని తాము చర్చల సందర్భంగా గుర్తించినట్లు, ఉగ్రవాదంపై కేంద్రీకృత చర్యకు అంగీకరించినట్లు మోడీ తెలిపారు. ఉమ్మడి, భద్రతాయుత, సుభిక్ష భవితకు శ్రీలంకతో జట్టుకట్టాలనే భారతదేశ ప్రగాఢ ఆకాంక్షను పునరుద్ఘాటించినట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనకర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రితశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు, ప్రధాని మోడీ గౌరవార్థం అధ్యక్షులు సిరిసేన విందు ఇచ్చారని కూడా చెప్పారు. శనివారం మాల్దీవుల పర్యటన తరువాత మోడీ నేరుగా శ్రీలంకకు వచ్చారు.

మోడీకి బుద్ధ విగ్రహం కానుక..
శ్రీలంకకు వచ్చిన ప్రధాని మోడీకి మైత్రిపాల తమ మైత్రికి చిహ్నంగా అరుదైన కానుకను బహుకరించారు. సమాధిస్థితిలో ఉన్న బుద్ధుడి ఈ విగ్రహం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ విగ్రహ అసలు రూపాన్ని 4, 7 శతాబ్దాల మధ్య శిల్పులు చెక్కారు. అనురాధపుర యుగంలో ఇది అత్యంత మేలిమి విగ్రహంగా పేరొందింది. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది. బుద్ధుడు ధ్యానముద్రతో సమాధి స్థితిలో ఉన్న ఈ విగ్రహం అపురూపంగా ఉందని పిఎంఒ వర్గాలు తెలిపాయి. దేశాధ్యక్షుడి సచివాలయానికి చేరుకునే ముందు ప్రధాని మోడీ మార్గమధ్యంలోని ప్రఖ్యాత సెయింట్ ఆంథోని చర్చిని సందర్శించారు. ఈస్టర్ నాడు అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. వారి కటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కొందరి పిరికిపంద చర్యలు శ్రీలంక ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేవని, శ్రీలంక వారితో భారతదేశం ఎప్పుడూ సంఘీభావంతో వ్యవహరిస్తుందని మోడీ తెలిపారు. ఆ తరువాత ప్రధాని మోడీ దేశాధ్యక్షుడి కార్యాలయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వర్షం పడుతూ ఉండటంతో అధ్యక్షులు సిరిసేన గొడుగు పట్టుకుని తాను , ప్రధాని మోడీ తడవకుండా నడిచారు. ఆ తరువాత శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘేతో ప్రధాని మోడీ ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకలో భారతదేశం తరఫున విరివిగా ప్రజా సంబంధిత కార్యక్రమాలను చేపడుతామని, ఈ విధంగా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం మరింతగా ఇనుమడిస్తుందని మోడీ తమ చర్చల్లో విక్రమసింఘేకు హామీ ఇచ్చారు.

శ్రీలంకలో ప్రతిపక్ష నేత మహీంద రాజపక్కతో కూడా మోడీ విస్తృత చర్చలు జరిపారు. ఉగ్రవాద నిరోధక, ఆర్థిక పరిపుష్టి, భద్రతలకు ఉమ్మడిగా కదలాల్సి ఉందని మోడీ తెలియచేశారు. ఈ ద్వీప దేశానికి ఒక్కరోజు హుటాహుటి పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి బయలుదేరారు. తనకు చిరస్మరణీయ, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ఇంతకు ముందు 2015 తరువాత 2017లో శ్రీలంకలో పర్యటించారు. ఈ పర్యటన మూడవది.

PM Modi discusses with Sirisena in Sri Lanka

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉమ్మడి సవాలు ఉగ్రవాదమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: