హువాతో హువానా…జనంతో మజాకానా?

  మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో మోడీ విసుర్లు  పిట్రోడా మాటలపై తూటాలు రాట్లం : సిక్కుల ఊచకోతపై హువా తో హువా (అయినదేమో అయినది) వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శలను ఉధృతం చేశారు. అన్ని దారుణాలకు పాల్పడటం జరిగిందేదో జరిగిందనడం కాంగ్రెస్ అలవాటుగా మారిందన్నారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం ఆయన ఎన్నికల సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, రాజీవ్ సన్నిహితుడు శామ్ పిట్రోడా చేసిన హువా తో హువా మాటాలను మోడీ […] The post హువాతో హువానా… జనంతో మజాకానా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో మోడీ విసుర్లు
 పిట్రోడా మాటలపై తూటాలు

రాట్లం : సిక్కుల ఊచకోతపై హువా తో హువా (అయినదేమో అయినది) వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శలను ఉధృతం చేశారు. అన్ని దారుణాలకు పాల్పడటం జరిగిందేదో జరిగిందనడం కాంగ్రెస్ అలవాటుగా మారిందన్నారు. మధ్యప్రదేశ్‌లో సోమవారం ఆయన ఎన్నికల సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, రాజీవ్ సన్నిహితుడు శామ్ పిట్రోడా చేసిన హువా తో హువా మాటాలను మోడీ ప్రస్తావించారు. పిట్రోడా మాటలు తేలికగా తీసుకోవడానికి వీల్లేనివని ప్రధాని తేల్చిచెప్పారు. 1984లో ఇందిర హత్యానంతరం సిక్కులపై దాడులు జరిగాయని, వీటిపై విచారం వ్యక్తం చేయాల్సిన కాంగ్రెస్ నేతలు జరిగిందేదో జరిగిందని చెపితే, ప్రజలు వారికి చేసింది ఇక చాలు అని పూర్తి స్థాయిలో జవాబు ఇస్తారని మోడీ తెలిపారు. కాంగ్రెస్‌కు అన్ని విషయాలలో జరిగిందేదో జరిగిందని చెప్పడం రివాజు అయిందన్నారు. దేశ ప్రజల ఆస్తి అయిన ఐఎస్‌ఎన్ విరాట్‌ను అప్పటి ప్రధాని రాజీవ్ కుటుంబ విహార యాత్రలకు వాడుకున్నాడని తాను చెపితే , ఈ కాంగ్రెస్ వారు హువా తో హువా అంటారని, ఇక నక్సల్స్ దాడులలో జవాన్లు బలి అయ్యారంటే అయితే ఏమిట? హువాతో హువా అంటారని, కాంగ్రెస్ జమానాలో జరిగిన దారుణ ఘటనలను ప్రస్తావిస్తూ పోతూ ఉంటే అయిందేదో అయిందని తేలికగా తీసేస్తుంటారని , ఇది ఉత్తుత్తి ఊత పదపు జవాబు కాదని కాంగ్రెస్ వారి పొగరుకు తార్కాణం అని మోడీ మండిపడ్డారు. లోక్‌సభ చివరి దశ పోలింగ్ ప్రచారంలో భాగంగా మోడీ ఇక్కడికి వచ్చారు. కల్తీ కూటమిల వాలాలు ఈ మాటలు అంటూ ఉంటే ప్రజలు ఇక చేసింది చాలు అని వారికి సమాధానంగా అబ్ బహుత్ హువా అని తేల్చిచెపుతున్నారని అన్నారు. విశ్లేషకులు, మేధావులు అని ప్రచారం చేసుకునే వారు, ఢిల్లీ కేంద్రంగా ఉత్పత్తి అయ్యే గాలి వార్తలలో దేశంలో మోడీ గాలి లేదని చెపుతున్నారని, దీనిని తాను తోసిపుచ్చుతున్నానని, అనుకూల పవనాలు ప్రతి ఇంటి నుంచి వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా అ హంకారం మెండుగా ఉందని, సిక్కు సోదరలుపై జరిగిన దాడులను వారు తేలిగ్గా కొట్టి పారేయడం దారుణం అని,ప్రజానీకం దేనిని అయినా సహిస్తారు కానీ అహంభావాన్ని సహించబోరని చెప్పారు.

PM Modi criticism on Congress

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హువాతో హువానా… జనంతో మజాకానా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: