పోలీసు స్టేషన్ ఎదుట ప్రధాని మోడీ సోదరుడి ధర్నా

జైపూర్‌: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జైపూర్ – అజ్మేర్ నేషనల్ హైవేపై ఉన్న బగ్రు పోలీసు స్టేషన్ వద్ద ఆయన ధర్నా చేశారు. మోడీ సోదరుడు కావడంతో ప్రహ్లాద్ కు ఇద్దరు గన్ మెన్లతో భద్రత ఏర్పాటు చేశారు. అయితే నిబంధనల మేరకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన వాహనంలోనే ప్రయాణించాలి. అయితే ఇందుకు ప్రహ్లాద్ అంగీకరించలేదు. […] The post పోలీసు స్టేషన్ ఎదుట ప్రధాని మోడీ సోదరుడి ధర్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జైపూర్‌: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. జైపూర్ – అజ్మేర్ నేషనల్ హైవేపై ఉన్న బగ్రు పోలీసు స్టేషన్ వద్ద ఆయన ధర్నా చేశారు. మోడీ సోదరుడు కావడంతో ప్రహ్లాద్ కు ఇద్దరు గన్ మెన్లతో భద్రత ఏర్పాటు చేశారు. అయితే నిబంధనల మేరకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన వాహనంలోనే ప్రయాణించాలి. అయితే ఇందుకు ప్రహ్లాద్ అంగీకరించలేదు. తన వ్యక్తిగత సిబ్బందికి వేరే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలని ప్రహ్లాద్ పోలీసులను డిమాండ్ చేశారు. అయితే అందుకు నిబంధనలు అంగీకరించవని పోలీసులు ప్రహ్లాద్ కు సర్ది చెప్పారు. దీంతో తన ధర్నాను విరమించి, భద్రతా సిబ్బందిని తన వాహనంలోనే వచ్చేందుకు ఆయన అంగీకరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

PM Modi Brother Prahlad Modi Protest At Police Station

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోలీసు స్టేషన్ ఎదుట ప్రధాని మోడీ సోదరుడి ధర్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: