వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన  భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు  పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు  రామమయం అయిన అయోధ్య అయోధ్య: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ వేదమంత్రోచ్చారణల నడుమ బుధవారం శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన […] The post వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
 భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు
 పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు
 రామమయం అయిన అయోధ్య

అయోధ్య: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ వేదమంత్రోచ్చారణల నడుమ బుధవారం శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు ఐదు విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయనిఆగమ పండితుల భావన. హరిద్వార్‌నుంచి తీసుకు వచ్చిన పవిత్ర గంగా జలాలు, పుణ్యనదుల జలాలను భూమిపూజలో వినియోగించారు. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువును నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనా దృష్టాకార్యక్రమానికి విచ్చేసిన అతిథులంతాకూడామాస్కులు ధరించి సామాజికదూరాన్ని పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిరహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆన్‌లైన్‌ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. భూమిపూజ సందర్భంగా అయోధ్య నగరమంతా కూడా రామమయంగా మారింది. జైశ్రీరాం నినాదాలతో నగరం మార్మోగి పోయింది. అయోధ్యకు వెళ్లే రోడ్లన్నీ కూడా ప్రతిపాదిత రామమందిర చిత్రాలతో కూడిన హోర్డింగ్‌లతో అలంకరించారు. పట్టణంలోని చాలా షాపులను ముదురు పసుపు రంగుతో పెయింట్ చేశారు. అయోధ్యలో భూమి పూజకు సమాంతరంగా దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగాయి.

హనుమాన్ గడి ఆలయంలో మోడీ పూజలు
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విచ్చేసిన ప్రధాని తొలుత హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే ఆయన వెంట ఉన్నారు. ఇరువురు అయిదు నిమిషాల పాటు ఆలయమంతా కలయ తిరిగారు. అనంతరం ప్రధాని రామజన్మభూమిలో రాంలల్లాను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు లక్నో విమానాశ్రయంనుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ప్రధానికి యుపి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. మామూలు వస్త్రధారణకు భిన్నంగా ప్రధాని పంచెకట్టులో కనిపించడం విశేషం.

PM Modi begins Ram Mandir Puja in Ayodhya

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: