సీట్లు తగ్గితే గెలుపా ఓటమా?

  గత అయిదేళ్లలో మోడీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ లాంటి సంస్కరణల ప్రస్తావన లేకుండా, వాటి ఫలితాలను పక్కనపెట్టి తానేదో సమర్థుడైనట్లు, తనను నిలవరించడానికి, దేశ ప్రగతికి గండి కొట్టేలా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కొత్త పలుకులు వినిపిస్తున్నారు. దేశాన్ని అయిదేళ్లు పాలించిన వ్యక్తిగా తన విజయాల్ని, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని జన ప్రయోజనకర పథకాలపై భరోసా ఇచ్చేలా ఉపన్యసించాల్సింది పోయి సభ కొక్క రీతిలో, […] The post సీట్లు తగ్గితే గెలుపా ఓటమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గత అయిదేళ్లలో మోడీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ లాంటి సంస్కరణల ప్రస్తావన లేకుండా, వాటి ఫలితాలను పక్కనపెట్టి తానేదో సమర్థుడైనట్లు, తనను నిలవరించడానికి, దేశ ప్రగతికి గండి కొట్టేలా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కొత్త పలుకులు వినిపిస్తున్నారు. దేశాన్ని అయిదేళ్లు పాలించిన వ్యక్తిగా తన విజయాల్ని, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని జన ప్రయోజనకర పథకాలపై భరోసా ఇచ్చేలా ఉపన్యసించాల్సింది పోయి సభ కొక్క రీతిలో, పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. తన దగ్గర సభాముఖంగా గర్వంగా చెప్పుకునే అంశమొక్కటి లేకపోవడంతో ఓటర్ల మనోభావాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనే ఆలోచనలోపడ్డారు.

వ్యతిరేకత వెన్నంటే తిరుగుతున్నా నరేంద్రమోడీ మాత్రం ఎన్నిక ప్రచారంలో ఊరికొక్క కొత్త బాణాన్ని సంధిస్తూనే ఉన్నారు. సామాన్యుడి జీవనంలో గుణాత్మకమైన మార్పును సాధించిపెడతానని 2014లో నమ్మ బలికిన ఆయన మొగున్ని కొట్టి మొత్తుకున్నట్లు ఇప్పుడు సానుభూతిని సృష్టించుకోవడానికి తంటాలు పడుతున్నాడు. గత అయిదేళ్లలో మోడీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి సంస్కరణల ప్రస్తావన లేకుండా, వాటి ఫలితాలను పక్కనపెట్టి తానేదో సమర్థుడైనట్లు, తనను నిలవరించడానికి, దేశ ప్రగతికి గండి కొట్టేలా కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కొత్త పలుకులు వినిపిస్తున్నారు.

దేశాన్ని అయిదేళ్లు పాలించిన వ్యక్తిగా తన విజయాల్ని, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని జన ప్రయోజనకర పథకాలపై భరోసా ఇచ్చేలా ఉపన్యసించాల్సింది పోయి సభ కొక్క రీతిలో, పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. తన దగ్గర సభాముఖంగా గర్వంగా చెప్పుకునే అంశమొక్కటి లేకపోవడంతో ఓటర్ల మనోభావాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనే ఆలోచనలోపడ్డారు. వేల కోట్ల రూపాయలతో పెద్దనోట్ల రద్దును ఘనంగా ప్రచారం చేసిన మోడీ వేదికపై దాని ప్రస్తావనే లేకపోవడం ఆయన అంతర్మాత బోధనకు నిదర్శనం.

పార్లమెంటు ఎన్నికలకు రెండు నెలల ముందు అనగా 14 ఫిబ్రవరి పుల్వామా జిల్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల వాహన బాంబు దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించడం విషాదకర సంఘటన. భారత వాయుసేనలు పాక్ భూభాగంలోకి చొరబడి తీవ్రవాదుల శిక్షణా శిబిరాలపై బాంబులు కురిపించి వాటిని ధ్వంసం చేసినట్లు పలువురు శిక్షణ పొందుతున్న తీవ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాక్ ఎదురు దాడిలో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ ప్రజలకు చిక్కడం, పాకిస్థాన్ ఆయన్ని తిరిగి భారత్‌కు అప్పగించడం ఓ ఉత్కంఠ భరిత సన్నివేశం. నోట్ల రద్దు దెబ్బకు సరిహద్దుల్లోని తీవ్రవాదం కూడా మట్టి కరుస్తుందన్న ప్రధాని మాట గుర్తుకొచ్చినా ప్రయోజనం శూన్యం.

ఎన్నికలకు ముందు ఈ సంఘటనలు జరగడంతో భారత్ నిఘా వైఫల్యాలను కప్పి పుచ్చుతూ, పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే సమాధానం మా పాలన కాబట్టి ఈయగలిగింది అని ప్రచారానికి తెర లేపారు. సైన్యం పట్ల దేశ పౌరులకున్న గౌరవాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పిన దాని నియంత్రణను యధేచ్ఛగా ఆయన ఉల్లంఘిస్తున్నారు.

మోడీ సామాజికంగా ఏ వర్గానికి చెందిన వాడనే విషయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. గుజరాత్‌లోని వైశ్యుల్లో కొందరు గానుగల ద్వారా నూనె తీసి అమ్మే వృత్తిలో కొనసాగి క్రమంగా ఒక తెగగా ఏర్పడిపోయారు. మోడీ గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలోనే ఈ తెగను ఒసి నుండి విడదీసి ప్రత్యేక గుర్తింపుగా బలహీన వర్గాల జాబితాలో చేర్చబడింది అని రుజువులున్నాయి. అందువల్ల మోడీ బిసియా కాదా అనేదీ ఇంకా కొలిక్కి రాని విషయం. అయితే ఏప్రిల్ చివరి వారంలో ఆయన యుపిలోని హర్డోయి, కన్నోజ్, సీతాపూర్‌లలో ప్రచారంలో భాగంగా తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వాడను. తన ఊర్లోనే తన వర్గానికి చెందిన మరో ఇల్లు కూడా లేదు. తను వెనుకబడిన వర్గానికి చెందినందువల్ల తనను తిరిగి అధికారంలోకి రాకుండా మాయావతి, అఖిలేశ్ యాదవ్ కులం కార్డుతో ఆడుకుంటున్నారు అన్నాడు. అసలు ఇన్నేళ్ల మోడీ పాలనలో ఏమైనా బిసి ముద్ర ఉన్నదా! దేశంలోని 54% బిసిలు ఎవరైనా ఆయన్ని తమ వాడుగా భావించారా! ఆయన మాటల్ని బిసిలైనా నమ్మి ఆయనకు తోడు నిలబడే ఆస్కారం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలకు లేదనే సమాధానమే వస్తుంది.

దేశంలోని ఉన్నత సామాజిక వర్గాలకు ఉద్యోగాల్లో చదువులో 10% రిజర్వేషన్ కల్పించి ఇతర రాజకీయ పార్టీలను ఇరకాటంలో పెట్టిన వాడు మోడీ, అనగా అందరూ పోటీపడే జనరల్ కాటగిరీ నుండి 10% అవకాశాన్ని బడుగు వర్గాలు కోల్పోయినట్లే. అలాంటి మోడీ నాసిక్, నందూర్బర్ జిల్లాల్లో గిరిజన, రైతు వర్గాలను ఉద్దేశించి ‘మోడీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ మార్చలేరు. అంబేడ్కర్ అభీష్టాన్ని నెరవేర్చడమే తన లక్షమని’ ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈయమని కోరుతున్నా దిగువ సామాజిక వర్గాలకు ఆయన మాటల ద్వారా కలిగే ప్రయోజనం శూన్యం. ఫిబ్రవరి 7, 2018 నాడు పార్లమెంటులోనే మోడీ ఆంధ్రప్రదేశ్ విభజనపై విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా ఎపిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టింది అన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకెజీ లేదా హోదా విషయం చర్చకు వచ్చినప్పుడు ఆయన ఇలా ప్రస్తుత కర్తవ్యం మరచి విభజన పట్ల ప్రస్తావన తెచ్చారు.

ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో సైతం ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించిన కాంగ్రెస్ రేపు దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడదీస్తుందని ఓ సభలో అన్నారు. ఎపి విభజనకు ఆనాడు పార్లమెంటు ఉభయ సభలో బిజెపి సైతం మద్దతు ఇచ్చిందనే విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయినట్లు ప్రవర్తించారు.

ఏప్రిల్ 25ను మీడియాలో హిందీ నటుడు అక్షయ్ కుమార్ మోడీతో జరిపిన సంభాషణ కూడా ఎలాంటి ముద్ర వేయకుండానే తేలిపోయింది. అందులో లేవనెత్తిన అంశాలేవీ ఆయనలో దేశ ప్రధాని అర్హతను పెంచే విధంగా లేవు. తాను చిన్నతనంలో స్కూలు బూట్లకు సుద్ద ముక్కలతో తెలుపు రంగు వేసుకునేవాడినని, తన బట్టలు తానే ఉతుక్కునే వాడినని, రాజకీయాల్లోకి రాకపోతే సన్యాసుల్లో కలిసే వాడినని, చిన్నప్పుడు కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పుకొచ్చారు. ఆయన అనుభవించింది పేదరికం అయితే దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి జీవితాలు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి.
మే 6న పశ్చిమ బంగాలో ప్రచారం చేస్తూ ‘రాష్ట్రంలో పూజలు నిర్వహించుకోడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, జై శ్రీరామ్ అని పలికినా కటకటాల్లోకి నెట్టివేసే దుస్థితి ఉందన్నారు.

2014లో 282 సీట్లు సొంతంగా సంపాదించుకొన్న బిజెపికి ఇప్పుడు ఆ సంఖ్యలోంచి వంద సీట్లు తగ్గడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ సంస్థ అయినా వార్షిక ఫలితాలు ప్రకటించుకున్నప్పుడు గత ప్రకటిత లాభం కన్నా పెరిగితేనే ఆ సంస్థకు మంచి రేటింగ్ దొరుకుతుంది. సుమారు వంద సీట్లు కోల్పోనుందన్న బిజెపి తన పాలనలో గెలిచినట్లా, విఫలమయినట్లా. పాలన ప్రజారంజకంగా ఉంటే సీట్లు ఉన్నవున్నట్లయినా రావాలి లేదా పెరగాలి. తగ్గడం ఓటమికి నిదర్శనం కాదా! బిజెపిలోని సీనియర్లను వివిధ వంకలతో పక్కకు తప్పించిన మోడీ, అమిత్‌ల ద్వయం ఆ పార్టీకి చేసిన కీడుయే ఎక్కువ. మోడీ పాలనలో సంఘ్‌పరివార్ శక్తులు విజృంభించారు. పార్టీకి అర్థబలంగా నిలిచిన పారిశ్రామిక వేత్తలు రెండు చేతులా సంపాదించుకొని ప్రభుత్వ రంగ సంస్థలను చావగొట్టారు. అయిదేళ్ల పాలకుడి స్థాయిలో లేని మోడీ మాటలతో మళ్లీ బిజెపికి అధికారం చేజిక్కడం అనుమానమే.

PM Modi addresses beneficiaries of Jan Aushadhi Yojana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సీట్లు తగ్గితే గెలుపా ఓటమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: