ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం…

  రైతుల్లో వెల్లివిరిస్తున్న ఆనందం వరంగల్  : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన ప్రజలకు ఈ వర్షం ఊరటను ఇచ్చినట్లయింది. ప్రధానంగా రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఉదయం నుండే భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ వడగాలులతో జనం భేజారైపోయారు. సాయంత్రం 6 […] The post ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతుల్లో వెల్లివిరిస్తున్న ఆనందం

వరంగల్  : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన ప్రజలకు ఈ వర్షం ఊరటను ఇచ్చినట్లయింది. ప్రధానంగా రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఉదయం నుండే భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ వడగాలులతో జనం భేజారైపోయారు. సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమైన భారీ వర్షం రాత్రి అయినా కురుస్తూన ఉంది. ఈ వర్షంతో దుక్కులు దున్నిన పంట చేలల్లో వరద పొంగి పొర్లుతుంది. పత్తి విత్తనాలు, మొక్కజొన్నలు వేసిన రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చినట్లయింది.

Pleasure among farmers with heavy Rains

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: