ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతతో పాటు, రెండు మొక్కలు నాటాలి…

  చర్లపల్లి : మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణంతో పాటు స్వచ్చమైన నీరు అందించాలంటే ప్రతి ఇంటికి ఓ ఇంకుడుగుంతతో పాటు రెండు మొక్కలు నాటాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ అన్నారు. ఇంకుడుగుంతల దినోత్సవం సందర్భంగా శనివారం కాప్రా సర్కిల్ పరిదిలోని ఏఎస్‌రావునగర్‌లో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటి కమిషనర్ ధశరత్, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ పజ్జురి పావనిరెడ్డిలతో కలసి ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈసందర్భగా నిర్వహించిన సేవ్ వాటర్ అవగాహన ర్యాలీలో అధికారులు, […] The post ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతతో పాటు, రెండు మొక్కలు నాటాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చర్లపల్లి : మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణంతో పాటు స్వచ్చమైన నీరు అందించాలంటే ప్రతి ఇంటికి ఓ ఇంకుడుగుంతతో పాటు రెండు మొక్కలు నాటాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ అన్నారు. ఇంకుడుగుంతల దినోత్సవం సందర్భంగా శనివారం కాప్రా సర్కిల్ పరిదిలోని ఏఎస్‌రావునగర్‌లో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటి కమిషనర్ ధశరత్, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ పజ్జురి పావనిరెడ్డిలతో కలసి ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఈసందర్భగా నిర్వహించిన సేవ్ వాటర్ అవగాహన ర్యాలీలో అధికారులు, కాలనీ వాసులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ… నీటిని వృద చేయరాదని సమాజంలో నీరు లేకపోతే మానవ మనుగడ లేదని భూమి మీద ఉన్న ప్రతి జీవికి నీరు అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరు నీటి పోదుపును ఇతరులకు తెలియజేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాప్రా సర్కిల్ ఈఈ కోటేశ్వర్‌రావు, డిఈ బాలకృష్ణ, ఏఎంహెచ్‌ఒ డాక్టర్ మైత్రేయి, ఎఈ సంతోష్‌రెడ్డి, వాటర్ వర్క జీఎం. కిరన్‌కుమార్, డిజిఎం కృష్ణ, స్ధానిక నాయకులు మణిపాల్‌రెడ్డి, అంజిరెడ్డి, సీతరాంరెడ్డి, నర్సింహ్మరెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Plants should be Planted to Provide Clean Weather

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతతో పాటు, రెండు మొక్కలు నాటాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: