పల్లె ప్రగతికి అడుగులు

  వరంగల్ రూరల్ :  గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక శుక్రవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో మౌళిక వసతి సదుపాయాలన్నీ కలిగి ఉండాలన్న లక్ష్యంతో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను, మండల, గ్రామస్థాయి అధికారులందరిని భాగస్వాముల్ని చేస్తూ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ సర్వం సిద్ధం చేసి యంత్రాంగాన్ని […] The post పల్లె ప్రగతికి అడుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ రూరల్ :  గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక శుక్రవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో మౌళిక వసతి సదుపాయాలన్నీ కలిగి ఉండాలన్న లక్ష్యంతో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను, మండల, గ్రామస్థాయి అధికారులందరిని భాగస్వాముల్ని చేస్తూ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ సర్వం సిద్ధం చేసి యంత్రాంగాన్ని కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6న ప్రారంభమైన 30 రోజుల పాటు కొనసాగాలి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం జిల్లాలోని సంగెం మండల కాపులకనపర్తి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాక జిల్లా కలెక్టర్ హరిత, పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి కింద కూర్చూనే గ్రామ సభ నిర్వహించారు. గ్రామానికి అవసరమైన పనులు గుర్తించాలని, స్మశానవాటికకు స్థలం గుర్తించాలని, మొక్కలు పెద్ద ఎత్తున నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సర్పంచ్, ఎంపిటిసికి సూచించారు. అనంతరం మధ్యాహ్నం నెక్కొండ మండలం అలంకానిపేటలో నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

హోటల్ ముందు చెత్తను ఏరేసిన మంత్రి..
కాపుల కనపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, మండల నాయకులు, గ్రామనాయకులతో మాట్లాడుతూనే ఎదురుగా హోటల్ ముందు తాగిపడేసిన చాయ్, పేపర్ గ్లాసులు, ఇతర చెత్త చెదారాన్ని చూసి స్వయంగా వారే చెత్త బుట్టలో వేశారు. మంత్రి స్వయంగా చెత్తను చేతితో తీసివేస్తుండడంతో పక్కనే ఉన్న ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి కూడా ఏరారు. గ్రామాన్ని పచ్చధనంతో పాటు పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు ఎవరైనా సరే బేషజాలాన్ని వీడి భాగస్వాములు కావాలన్నా సంకేతాన్ని మంత్రి ఇచ్చారని పలువురు చర్చించుకున్నారు.

401 పంచాయతీల్లో పక్కాగా ప్రణాళిక..
రూరల్ జిల్లాలోని 401 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుండి పక్కాగా కార్యాచరణ ప్రణాళిక తయారీకి రంగంలోకి దిగారు. తొలిరోజు గ్రామాల ప్రత్యేకాధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. రెండోరోజు అనగా శనివారం గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర వహించే కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ కుటుంబసభ్యులకు, వార్డు సభ్యులకు ఈ కమిటీల్లో ఉండకుండా జాగ్రత్తపడాలి.

ప్రతిగ్రామానికి ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల చొప్పున 401 పంచాయతీలకు 1203 మంది కోఆప్షన్ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రతి మండలంలో రెండు మోడల్ గ్రామాలను గుర్తించాల్సి ఉంటుంది. వార్షిక, పంచవర్ష ప్రణాళికను తయారు చేసి గ్రామ సభల్లో అమోదింపజేసుకోవాలి. ఇలా గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రణాళిక తయారీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరిని అధికారులు భాగస్వాములను చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్, పంచాయతీరాజ్ శాఖా కమిషనర్ రఘునందన్‌రావు, డిఆర్‌డిఒ సంపత్‌రావు, డిఆర్‌డిఒ సంపత్‌రావు, డిఎల్‌పిఒ స్వరూప, సిఈఒ రాజారావు, ఆర్‌డిఒ మహేందర్‌జీ, స్థానిక ఎంపిపి కందగట్ల కళావతి నరహరి, ఎంపిడిఒ మల్లేష్‌గౌడ్, జడ్పిటిసి సభ్యులు గూడ సుదర్శన్‌రెడ్డి, కాపుల కనపర్తి సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Plans for the development of Villages

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పల్లె ప్రగతికి అడుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.