స్మార్ట్ సిటీ నిధులతో ప్లానిటోరియం పునరుజ్జీవం…

  వరంగల్ : వరంగల్ నగరానికి మరింత గుర్తింపు తెచ్చే విధంగా స్మార్ట్ సిటీ నిధులతో మ్యూజికల్ గార్డెన్ సమీపంలో ప్లానిటోరియంను పునరుజ్జీవింప చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ తెలిపారు. ఉన్న ప్లానిటోరియంను నిర్వహించుటకు తక్కువ ఖర్చుతో చేయాల్సిన పనుల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై శుక్రవారం కలెక్టరేట్ నందు వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న వెన్‌కోస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ “కాస్మోస్ స్పేస్ థియేటర్‌” పేరున తయారు చేసిన డిజైన్లను పవర్‌పాయింట్ […] The post స్మార్ట్ సిటీ నిధులతో ప్లానిటోరియం పునరుజ్జీవం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : వరంగల్ నగరానికి మరింత గుర్తింపు తెచ్చే విధంగా స్మార్ట్ సిటీ నిధులతో మ్యూజికల్ గార్డెన్ సమీపంలో ప్లానిటోరియంను పునరుజ్జీవింప చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ తెలిపారు. ఉన్న ప్లానిటోరియంను నిర్వహించుటకు తక్కువ ఖర్చుతో చేయాల్సిన పనుల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై శుక్రవారం కలెక్టరేట్ నందు వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న వెన్‌కోస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ “కాస్మోస్ స్పేస్ థియేటర్‌” పేరున తయారు చేసిన డిజైన్లను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

రూ.5 కోట్ల 20 లక్షల అంచనాతో, దీర్ఘకాలం పాటు లీజ్ పద్ధతిని సొంత పెట్టుబడితో నిర్వహించుటకు చేసిన ఈ ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ అంగీకరించలేదు. విద్యార్థులు, యువతకు శాస్త్రీయ అంశాల పట్ల అవగాహన కల్పించుటకు ఈ ప్లానిటోరియంను తక్కువ ఖర్చుతో తిరిగి వినియోగంలోకి తేవాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా చేయాల్సిన పనులకు మాత్రమే నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.

ప్లానిటోరియంలో ఉన్న ప్రస్తుత స్క్రీన్‌ను మార్చాల్సి ఉంటే నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే స్వల్ప కాలానికి మాత్రమే నిర్వహణ బాధ్యతలు అప్పగించుటకు వెసులుబాటు ఉందని తెలిపారు. రుసుం లేకుండా భరించే స్థాయిలో మాత్రమే ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్‌కోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంశీ, మున్సిపల్ కమిషనర్ రవికిరణ్, కుడా టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Planetarium development with Smart City Funded

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్మార్ట్ సిటీ నిధులతో ప్లానిటోరియం పునరుజ్జీవం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: