బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం… (వైరల్ వీడియో)

Plane

 

బీజింగ్: మీరు ఎప్పుడూ ఇలాంటి సీన్ చూసి ఉండరు. ఓ పెద్ద విమానం బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి ఎక్కడైన విమానం ఆకాశంలో దూసుకుపోతుంది కదా.. మరి బ్రిడ్జ్ కింద ఎలా ఇరుక్కుపోయింది అనుకుంటున్నారు?. అసలేం జరిగిందంటే… చెైనాలోని హర్బిన్ అనే ప్రాంతంలో ఓ భారీ ట్రక్కుపై కొత్తగా తయారు చేసిన ఇంజన్ లేని విమనాన్ని ఎయిర్ పోర్టుకు తరలిస్తుండగా మధ్యలో వచ్చిన ఓ బ్రిడ్జ్ కింద  హాస్యాస్పదంగా చిక్కుకుపోయింది. దీంతో డ్రైవర్ ఆ ట్రక్కు టైర్లలో కొంచెం గాలి తగ్గించి.. దానిని బ్రిడ్జి కిందనుంచి బయటకు తీశాడు. ఆ తర్వాత టైర్లలో గాలి నింపుకొని అక్కడ నుంచి విమానాశ్రయానికి వెళ్లిపోయాడు. అయితే, దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కాగా, డ్రైవర్ తన తెలివితో ట్రక్కును బయటికి తీసిన విధానాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Plane gets stuck under bridge in China

The post బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం… (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.