ములుగులో ఫోటో జర్నలిస్ట్ దారుణ హత్య

ములుగు : ములుగు జిల్లా పస్రా బేకరీ వద్ద ఓ ఫోటో జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుతి హవేలికి చెందిన బొమ్మినేని సునీల్‌రెడ్డి(38)గా గుర్తించారు. ఈ దాడిలో సునీల్ స్నేహితుడు దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను ములుగులోని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సునీల్ రెడ్డి అనేక తెలుగు వార్తాపత్రికలకు ఫోటోగ్రాఫర్‌గా, వరంగల్ కేంద్రంగా ఉన్న ఒక ఆంగ్ల వారపత్రికలో పనిచేశారు. […] The post ములుగులో ఫోటో జర్నలిస్ట్ దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ములుగు : ములుగు జిల్లా పస్రా బేకరీ వద్ద ఓ ఫోటో జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుతి హవేలికి చెందిన బొమ్మినేని సునీల్‌రెడ్డి(38)గా గుర్తించారు. ఈ దాడిలో సునీల్ స్నేహితుడు దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను ములుగులోని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సునీల్ రెడ్డి అనేక తెలుగు వార్తాపత్రికలకు ఫోటోగ్రాఫర్‌గా, వరంగల్ కేంద్రంగా ఉన్న ఒక ఆంగ్ల వారపత్రికలో పనిచేశారు. అతనను వరంగల్ ప్రెస్‌క్లబ్ కోశాధికారిగా కూడా పనిచేశాడు. రుణం తిరిగి చెల్లించడంలో వివాదం సునీల్‌రెడ్డి హత్యకు దారితీసిందని అంటున్నారు. ఈ కేసుపై పస్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Photojournalist Brutal Murder At Mulugu District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ములుగులో ఫోటో జర్నలిస్ట్ దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: