ముద్దులకు ఆయనే అధ్యక్షుడు (వీడియో)

మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో మహిళలపై అసభ్యకర కామెంట్లు చేసి వార్తల్లో నిలుస్తాడు. వార్తలోకి ఎక్కాడంటే మహిళలతో అసభ్యకరమైన పదాలు వాడడంతోనే ఆయన అంతర్జాలంలో వైరల్‌గా మారాడు. మనోడి వయస్సు ఎంతో తెలుసా 74 సంవత్సరాలు. కాటికి కాలుచాపేటోనికి ఇవేం బుద్ధులని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్రిగో జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ నాలుగు రోజులు పర్యటన చేసిన అనంతరం తన దేశవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశానికి చెందిన అమ్మాయిలతో చుంబన కార్యక్రమం […] The post ముద్దులకు ఆయనే అధ్యక్షుడు (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో మహిళలపై అసభ్యకర కామెంట్లు చేసి వార్తల్లో నిలుస్తాడు. వార్తలోకి ఎక్కాడంటే మహిళలతో అసభ్యకరమైన పదాలు వాడడంతోనే ఆయన అంతర్జాలంలో వైరల్‌గా మారాడు. మనోడి వయస్సు ఎంతో తెలుసా 74 సంవత్సరాలు. కాటికి కాలుచాపేటోనికి ఇవేం బుద్ధులని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్రిగో జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ నాలుగు రోజులు పర్యటన చేసిన అనంతరం తన దేశవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశానికి చెందిన అమ్మాయిలతో చుంబన కార్యక్రమం స్టేజీ మీద ఉండాలని హుకుంజారీ చేశాడు. దీంతో అధికారులు చేసేదేమీలేక ఫిలిప్పీన్స్ చెందిన ఐదుగురు అమ్మాయిలను వరసలో నిలబెట్టారు. సదరు అమ్మాయి స్టేజీ మీదికి రాగానే పెదవులపై ముద్దుపెట్టొద్దని సూచించింది. దీంతో రోడ్రిగో చెంపలపై ముద్దు పెట్టి పంపించారు. రెండో అమ్మాయి కూడా అంతే ముద్దు పెట్టేటప్పుడు చాలా ఇబ్బందిపడింది. మిగిలిన ముగ్గురు అలా చెంపలపై ముద్దు పెట్టించుకొని వెళ్లిపోయారు. తన సతీమణి ముందే ముద్దుల వ్యవహారం నడిచింది. ఈ సందర్భంగా రోడ్రిగో మాట్లాడుతూ… తాను ఇప్పటి వరకు పెదవులపై పైనే ముద్దు పెట్టానని, తాను నపుంసకుడిని కాకుండా సదరు అమ్మాయిలు సాయం చేశారని రోత పుట్టించే వ్యాఖ్యలు చేశాడు. గతంలో రొడ్రిగో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. కామాంధులారా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేయడమేంటి… చేస్తే గిస్తే మిస్ యూనివర్స్‌లపై అత్యాచారం చేయాలని మాట్లాడారు. దీంతో మహిళ సంఘాలు అతడిపై మండిపడ్డాయి. అత్యాచారాల శాతం పెరగటానికి అందమైన అమ్మాయిలు కారణమంటూ అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడిన సందర్భాలున్నాయి.

 

 

Courtesy by  Bisdak TV

 

The post ముద్దులకు ఆయనే అధ్యక్షుడు (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: