మునగాకులో మంచి గుణాలు

మునగ ఆకు ను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.  ఆకులోని ఔషధగుణాలు చాలామందికి తెలియదు.  మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో  వెల్లడైంది. మునగాకులో విటమిన్లు, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్-ఎ ని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధంలో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు […]

మునగ ఆకు ను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.  ఆకులోని ఔషధగుణాలు చాలామందికి తెలియదు.  మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో  వెల్లడైంది.

మునగాకులో విటమిన్లు, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్-ఎ ని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన ఔషధంలో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి లభిస్తుంది. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
* మహిళలు రోజుకు 7గ్రాముల మునగాకు పొడిని 3నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలిందని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
* ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషధం మునగాకు. ఊపిరితిత్తులు, కాలేయం, మహిళల్లో అండాశయంలో వచ్చే (ఒవేరియన్), నల్ల మచ్చల వద్ద వచ్చే (మెలానోమా) క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో తేలిందని వైద్యులు తెలుపుతున్నారు.
* యాంటీ ట్యూమర్ గానూ మునగాకు పనిచేస్తుంది.
* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే ప్రకృతి సిద్ధమైన ఔషధం ఈ ఆకు.
* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
* మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* ఇతర ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు.
* అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్‌లు కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి.
కీళ్ల నొప్పులకు దివౌషధం
* ప్రారంభ దశలో ఉన్న కీళ్ల నొప్పులకు మునగాకు దివ్య ఔషధం.
* మునగాకు నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మ రోగాలను నివారించవచ్చు.
* మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యం, రేచీకటి తొలగిపోతాయి.
* మునగ ఆకులో అమినో ఆమ్లాలు ప్రోటీన్ల లోపంవల్ల వచ్చే ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి.
* గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం.
* మునగ ఆకును క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.
* మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.
* మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.
*గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. *తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
* పాలిచ్చే తల్లులకు మునగాకు కూర వండి పెడితే మంచిది.
* గుప్పెడు మునగాకులను వంద మి.లీ. నీటిలో 5 నిమిషాలు కాచి చల్లార్చి, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.
* మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి కొంచెం తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గుతాయి.
* మునగ నిమ్మరసాలను కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్-హెడ్స్ తగ్గిపోతాయి.
మునగాకులో ఉండే పోషకాలు..
నీరు – 75.9 శాతం, పిండి పదార్థాలు-13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు-17 గ్రాములు, మాంసకృత్తులు-6.7 గ్రాములు, కాల్షియం- 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్-70 మిల్లీ గ్రాములు, ఐరన్-7 మిల్లీ గ్రాములు, సి విటమిన్- 200మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు-2.3శాతం, పీచు పదార్థాలు-0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ-97 కేలరీలు.

Comments

comments