మే 23 త‌ర్వాత‌ పెట్రో మంటలు..?: ర‌ణ్‌దీప్‌సింగ్

PM Modiన్యూఢిల్లీ: ప్ర‌స్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా లోక్ సభ ఎన్నిక‌ల వేడి క‌నిపిస్తుంది. పార్టీల నేత‌లు తమ ప్ర‌సంగాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే పలు చోట్ల ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రికొన్ని చోట్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా సాధరణ ఎన్నికలు పూర్త‌ికావడానికి మరిన్ని రోజులు ప‌ట్ట‌నుండ‌గా ఫ‌లితాలు మాత్రం మే 23న వెలువడనున్నాయి.

అయితే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏమో గానీ… అవి వ‌చ్చాక పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దేశవ్యాప్తంగా భారీగా పెర‌గ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ నేత‌లు గట్టిగా ప్ర‌చారం చేస్తున్నారు. మే 23న ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తోపాటు పార్లమెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా రానున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున అయిల్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయని సమాచారం. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రూ.10 వ‌ర‌కు పెర‌గ‌వచ్చ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న క్రమంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌కూడదని, పెంచితే తాము ఓడిపోతామ‌నే కార‌ణంతోనే ప్ర‌ధాని నరేంద్ర మోడీ మే23వ తేదీ వ‌ర‌కు ఇంధ‌న ధ‌ర‌లను పెంచొద్దని చ‌మురు కంపెనీల‌ను ఆదేశించారన్న విషయం తమకు తెలిసింద‌ని ర‌ణ్‌దీప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మే23వ తేదీన సాయంత్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌న్నారు. ఈ విషయం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా మోడీ మ‌భ్య‌పెడుతున్నార‌ని, క‌నుక ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని ర‌ణ్‌దీప్ అన్నారు.

Petrol And Diesel Prices Increase After May 23rd

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మే 23 త‌ర్వాత‌ పెట్రో మంటలు..?: ర‌ణ్‌దీప్‌సింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.