యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం..

  ఓ పెంపుడు కుక్క ప్రాణ త్యాగం చేసి తన యజమానిని కాపాడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కల్లూర్ గ్రామంలో నివసిస్తున్న ఆర్ఎమ్ పి డాక్టర్ కిశోర్, సూఫి అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, గత ఆదివారం కిశోర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ విషపూరిత పాము మెల్లగా పాకుతూ ఇంట్లోకి ప్రవేశించింది.యజమాని పక్కనే ఉన్న ఆ కుక్క పామును చూసి అడ్డుకుంది.అరుస్తూ పాముపై దాడి చేసింది.దీంతో పాము కుక్కను కాటు వేసింది. పాము […] The post యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓ పెంపుడు కుక్క ప్రాణ త్యాగం చేసి తన యజమానిని కాపాడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కల్లూర్ గ్రామంలో నివసిస్తున్న ఆర్ఎమ్ పి డాక్టర్ కిశోర్, సూఫి అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, గత ఆదివారం కిశోర్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ విషపూరిత పాము మెల్లగా పాకుతూ ఇంట్లోకి ప్రవేశించింది.యజమాని పక్కనే ఉన్న ఆ కుక్క పామును చూసి అడ్డుకుంది.అరుస్తూ పాముపై దాడి చేసింది.దీంతో పాము కుక్కను కాటు వేసింది. పాము విష కాటుకు ఆ కుక్క అరుస్తూ విలవిలలాడింది. ఇంతలో కిశోర్ మేలుకొని పామును చంపేసి, పాము కాటుతో బాధపడుతున్న కుక్కను పశువైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అయితే, ఆ కుక్క దారిలోనే చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న సూఫి చనిపోవడంతో కిశోర్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Pet Dog dies to Save Owner from snake in Khammam

The post యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: