రంగు కంటే వ్యక్తిత్వం ముఖ్యం

  ఈ ప్రపంచంలో సౌందర్యాన్ని గురించి కొన్ని మారని లెక్కలున్నాయి. పాలవంటి తెల్లని శరీర వర్ణానికే వంద మార్కులు పడతాయి. శరీరపు ఛాయను పెంచుతాయంటూ ఎన్నో క్రీములు ప్రపంచ మార్కెట్‌ని ఏలుతున్నాయి. ఈ విన్యాసాలను బద్ధలు చేస్తూ, ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుంది సూపర్ మోడల్ న్యాకిమ్ గట్వెక్. ఈమెను క్వీన్ ఆఫ్ డార్క్ అనే ముద్దుపేరుతో పిలుస్తారు. అసలు ఆఫ్రికావాసులు పుట్టుకతో నల్లనివాళ్లు. కానీ ఆ నలుపును తలదన్నే కారు నలుపుతోనే పుట్టింది న్యాకిమ్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో […] The post రంగు కంటే వ్యక్తిత్వం ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ ప్రపంచంలో సౌందర్యాన్ని గురించి కొన్ని మారని లెక్కలున్నాయి. పాలవంటి తెల్లని శరీర వర్ణానికే వంద మార్కులు పడతాయి. శరీరపు ఛాయను పెంచుతాయంటూ ఎన్నో క్రీములు ప్రపంచ మార్కెట్‌ని ఏలుతున్నాయి. ఈ విన్యాసాలను బద్ధలు చేస్తూ, ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుంది సూపర్ మోడల్ న్యాకిమ్ గట్వెక్. ఈమెను క్వీన్ ఆఫ్ డార్క్ అనే ముద్దుపేరుతో పిలుస్తారు. అసలు ఆఫ్రికావాసులు పుట్టుకతో నల్లనివాళ్లు. కానీ ఆ నలుపును తలదన్నే కారు నలుపుతోనే పుట్టింది న్యాకిమ్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె ఫొటోల వివరాల అప్‌డేట్‌లు చూస్తే ఆమె వెనక ఎన్నెన్ని అవమానాలు ఉన్నాయో అస్సలు అర్థం కాదు. ఓ సంవత్సరం క్రితం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. “ ఓ సారి ఊబర్ కారులో ప్రయాణం చేసిందట. ఇప్పుడు ఓ పదివేల డాలర్లు ఇస్తామంటే మీ ఒంటిని బ్లీచ్ చేయించుకొని కారు నలుపు వదిలించుకుంటారా అన్నాడ డ్రైవర్.

ఆ మాటలకు విరగబడి నవ్విందట న్యాకిమ్. నాకింత అందమైన దేహాన్ని భగవంతుడు ఇస్తే దీన్ని బ్లీచ్ చేసుకోవాలా నేను” అన్నదట. అప్పుడు క్యాబ్‌డైవర్ ‘ నీ ఒంటి రంగు దేవుని దయా’ అన్నాడట ఆశ్చర్యపోయి. “అవును మరి అందమైన చర్మం ఎవరికి ఉంటుంది” అన్నదట న్యాకిమ్. ఈ సంఘటనను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌తో పోస్ట్ చేసిందామె. ఇలా శరీరపు రంగు వల్ల అవమానాలు ఎదుర్కొన్న న్యాకిమ్ గట్వెక్‌కి లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన గురించి ఎంత గర్వంగా మాట్లాడుతుందీ అంటే “ నా చర్మం సూర్యకిరణాలను పీల్చుకుంటూ ఉంటే, నా వెంట్రుకలు భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి నేనో అద్భుతం కదా” అంటోంది. ఆఫ్రికన్ల జుట్టు దువ్వెనకు లొంగకుండా నిలబడి ఉంటాయి కదా మరి.

ఈ న్యాకిమ్ లాగే ఈమెతో పని చేసే ఇంకో మోడల్ ఖోడియా డియోప్ కూడా చర్మరంగు విషయంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది. ఆమెకు డార్కీ, డాటర్ ఆఫ్ ది నైట్ అనే నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. “ నన్ను నేను ప్రేమించుకోవటం మొదలు పెట్టాక నాకు ఇతరుల మాటలు వినిపించటం మానేశాయి” అంటోంది ఖోడియో ఈమె మాటలు న్యాకిమ్ పైన ఎంతో ప్రభావం చూపెట్టాయి. అమ్మాయిల రంగు పైన ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఓ అభిప్రాయాన్ని విదిల్చి కొట్టాలి అనుకుంది. తన చర్మపు రంగును హుందాగా స్వాగతించింది. ఇప్పుడు న్యాకిమ్ ప్రపంచస్థాయి మోడల్. అమ్మాయిలకు నిజంగానే ఆమె సరైన రోల్ మోడల్ కూడా!

Personality is more important than beauty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రంగు కంటే వ్యక్తిత్వం ముఖ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: