రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

Train Accidentహైదరాబాద్ : ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కదులుతున్న రైలును ఎక్కబోయిన యుపికి చెందిన మహేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. నాంపల్లి నుంచి విజయవాడకు వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరింది. ఈ క్రమంలో మహేశ్ రైలును ఎక్కబోయి కిందపడి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. శవ పరీక్ష కోసం మహేశ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Dead In Train Accident At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.