నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలు.. లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు

 

హైదరాబాద్‌: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవర్తిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వస్తున్నవారిపై లాఠికి పనిచెప్తున్నారు. అయినా, ప్రజలు పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తుండడంతో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సిపి సజ్జనార్‌ రంగంలోకి దిగారు. ఎర్రగడ్డ ప్రాంతంలో వాహనదారులను ఆపి సరైన కారణ లేకుండా రోడ్లపై తిరగొద్దని, కరోనావల్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారిని వెనక్కి పంపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని.. ద్విచక్రవాహనంపై ఒకరు, కార్లలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనడంపై లాక్‌డౌన్‌ ఉద్దేశాన్ని వివరించి, కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని సిిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

People not follow lockdown rules in Telangana 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలు.. లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.