రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 21 నుంచి చేపట్టనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13 నుంచి శరీర దారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పిఇసెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, ఒయు రిజిస్ట్రార్ […] The post రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 21 నుంచి చేపట్టనున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13 నుంచి శరీర దారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పిఇసెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, ఒయు రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, పిఇసెట్ కన్వీనర్ సత్యనారాయణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ టి.పాపిరెడ్డి పిఇసెట్‌కు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

పిఇసెట్ షెడ్యూల్
-దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 21,2020 నుంచి
-స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 13,2020
ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు: మే 6,2020
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20, 2020 నుంచి
PECET applications from tomorrow

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేపటి నుంచి పిఇసెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: