పిడిఎస్ బియ్యం పట్టివేత

  40 క్విటాళ్ల బియ్యం, ఆటోట్రాలీ, బైక్ స్వాధీనం ఐదుగురు నిందితుల అరెస్టు హైదరాబాద్ : అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ చేసిన ముఠాను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, 40 క్వింటాళ్ల బియ్యం, ఆటో ట్రాలీ, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 8.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ముషీరాబాద్, […] The post పిడిఎస్ బియ్యం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

40 క్విటాళ్ల బియ్యం, ఆటోట్రాలీ, బైక్ స్వాధీనం
ఐదుగురు నిందితుల అరెస్టు

హైదరాబాద్ : అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ చేసిన ముఠాను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, 40 క్వింటాళ్ల బియ్యం, ఆటో ట్రాలీ, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 8.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ముషీరాబాద్, బోలక్‌పూర్‌కు చెందిన ఎండి గౌస్‌ఉద్దిన్ అలియాస్ బాబు తక్కు వ్యాపారం చేస్త్తూ పిడిఎఫ్ బియ్యం సేకరిస్తున్నాడు.

ఎండి అస్ఘర్ హుస్సేన్ ఆటో డ్రైవర్, ఎండి తబ్రేజ్ సెంట్రింగ్ పనిచేస్తున్నాడు, ఎండి బిలాల్ క్లీనర్‌గా, ఎండి అఫ్సర్ వ్యాపారం చేస్తున్నాడు. ఐదుగురు కలిసి పిడిఎఫ్ బియ్యం లబ్ధిదారులు, రేషన్ డీలర్ల వద్ద నుంచి సేకరించి మిల్లర్లకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. ఐదుగురు కలిసి పిడిఎస్ బియ్యం సేకరించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, ఎస్‌వి న గర్‌లోని గోడౌన్‌లో నిల్వ చేస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యం 40 క్వింటాళ్లు అక్కడే నిల్వ చేశారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు ఎక్కువ ధరకు సరఫరా చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

దాదాపుగా 50 క్వింటాళ్ల బియ్యం సేకరించి వివిధ రాష్ట్రాల్లోని విక్రయదారులు, రైస్ మిల్లు యజమానులకు ఎక్కువ ధరకు రహస్యంగా సరఫరా చేస్తున్నారు. రైస్ మిల్లర్లు వాటిని పాలిష్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పేదల కోసం పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం అక్రమార్కుల చేతుల్లో పడుతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో అడిషనల్ డిసిపి సురేందర్‌రెడ్డి, ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్లు నవీన్ కుమార్, నవీన్ గౌడ్, కీసర ఎస్సై రత్నం పట్టుకున్నారు.

PDS rice seized by SOT Police

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిడిఎస్ బియ్యం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: