వచ్చే రెండేళ్లలో పేటీఎం ఐపిఒ

  కంపెనీ సిఇఒ విజయ్ శేఖర్‌ శర్మ న్యూఢిల్లీ: పేటీఎం ఐపిఒ కోసం సన్నాహాలను ప్రారంభించిందని, రాబోయే 22 నుంచి 24 నెలల్లో ఇష్యూ జారీ చేయనున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ విజయ్ శేఖర్‌శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సింగపూర్‌లో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ పేటీఎం ఐపిఒ గురించి ఆలోచిన్నామని అన్నారు. దేశీయ అతిపెద్ద ఇ కామర్స్, డిజిటల్ చెల్లింపుల దిగ్గజం గతేడాది వారెన్ బఫెట్‌కు చెందిన బర్క్‌షైర్ హాత్వే […] The post వచ్చే రెండేళ్లలో పేటీఎం ఐపిఒ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కంపెనీ సిఇఒ విజయ్ శేఖర్‌ శర్మ

న్యూఢిల్లీ: పేటీఎం ఐపిఒ కోసం సన్నాహాలను ప్రారంభించిందని, రాబోయే 22 నుంచి 24 నెలల్లో ఇష్యూ జారీ చేయనున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ విజయ్ శేఖర్‌శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సింగపూర్‌లో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ పేటీఎం ఐపిఒ గురించి ఆలోచిన్నామని అన్నారు. దేశీయ అతిపెద్ద ఇ కామర్స్, డిజిటల్ చెల్లింపుల దిగ్గజం గతేడాది వారెన్ బఫెట్‌కు చెందిన బర్క్‌షైర్ హాత్వే నుంటి 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. దీంతో సంస్థ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని శర్మ ఇటీవల తెలిపారు. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.

పేటీఎంకి సాఫ్ట్‌బ్యాంక్, అలీబాబా నిధులు సమకూర్చాయి. విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లడానికి ముందు తన సంస్థ మరింత నగదును సంపాదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమయం భారతదేశంలోని వ్యాపారవేత్తలకు స్వర్ణయుగం లాంటిదని, తాను ఈ సమయంలో జన్మించినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నానని చెప్పారు. ఒక చిన్న వ్యవస్థాపకుడు కూడా తన వ్యాపారాన్ని పెద్దదిగా చేసుకోగలిగే సమయం ఇది అని ఆయన అన్నారు. హిందూస్తాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్ వార్షిక కార్యక్రమం శుక్రవారం సింగపూర్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని అగ్ర నాయకులు పాల్గొన్నారు.

Paytm start planning IPO in 22, 24 months

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వచ్చే రెండేళ్లలో పేటీఎం ఐపిఒ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.