చరణ్‌తో పవన్ సినిమా..!

ఈ ఏడాది ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. గత నాలుగు నెలలుగా షూటింగ్స్ లేని కారణంగా ఈ మూవీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ కొత్త సినిమాను కూడా సెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్, చిరంజీవిలకు త్రివిక్రమ్ కథ వినిపించాడనే ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్‌తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని ఆ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్నాడట. చాలా రోజులుగా పవన్, చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలేకే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను పవన్, హాసిని హారిక బ్యానర్ రాధాకృష్ణ కలిసి నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత చరణ్ చేయబోతున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా లేదా అంతకు ముందు మరో సినిమాను చరణ్ చేస్తాడా అనేది చూడాలి.

Pawan Kalyan to produce Ram Charan next movie

The post చరణ్‌తో పవన్ సినిమా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.