పవన్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

    అమరావతి: ఒక్క ఎపి అసెంబ్లీలో ఎన్నికలలో ధనం ఏరులై పారింది. ఒక్కో నియోజకవర్గంలో అన్ని పార్టీలు కలిసి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు జగమెరిగిన సత్యం. అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించిన లెక్కలు చూస్తే షాక్ అవుతారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షలు, పార్లమెంట్‌కు బరిలో దిగి అభ్యర్థులు రూ.70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనలో ఉంది. కానీ మన అభ్యర్థులు సగం కూడా ఖర్చు చేయలేకపోతున్నామని […] The post పవన్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

అమరావతి: ఒక్క ఎపి అసెంబ్లీలో ఎన్నికలలో ధనం ఏరులై పారింది. ఒక్కో నియోజకవర్గంలో అన్ని పార్టీలు కలిసి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు జగమెరిగిన సత్యం. అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సమర్పించిన లెక్కలు చూస్తే షాక్ అవుతారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షలు, పార్లమెంట్‌కు బరిలో దిగి అభ్యర్థులు రూ.70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనలో ఉంది. కానీ మన అభ్యర్థులు సగం కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఎన్నికల సంఘానికి తెలుపుతున్నారు. ఎపి అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 8,39,790 రూపాయలు ఖర్చు, గంట శ్రీనివాసరావు (టిడిపి) 23, 19, 325 రూపాయలు, సబ్బం హరి (టిడిపి) రూ.11,18,617 ఖర్చుగా చూపించారు. గుడివాడ నుంచి పోటీ చేసిన అమర్(వైసిపి) రూ.12,60,554 ఖర్చు చేశారు. వైసిపి అభ్యర్థి కెకె రాజు 2,43,711 రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. దీంతో రాజకీయ నాయకులలో పేద రాజకీయ నాయకులనుకుంటా.. అందుకే ఖర్చు పెట్టలేకపోయారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఆదర్శ రాజకీయ నాయకులుగా మారేందుకు తక్కువ ఖర్చు చూపెడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. సొంత ఖర్చు గురించే చెప్పారనుకుంటా… బ్లాక్ మనీ రూపంలో ఖర్చు పెట్టిన వివరాలు అభ్యర్థులు వెల్లడించలేకపోయారని నెటిజన్లు చురకలంటించారు.

 

Pawan Kalyan Expenditure in AP Assembly Elections

The post పవన్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: