పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపలేదట..

భిన్న వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ తన సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు అరుదైన బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రతి ఏడాది వేసవిలో తన ఫామ్‌హౌస్‌లో పండే ఆర్గానిక్ మామిడి పండ్లను స్నేహితులకు పంపడం ఆయనకు ఆనవాయితీ. నితిన్, త్రివిక్రమ్ వంటి అత్యంత ఆప్తులకు ప్రతి ఏడాది ఆయన మామిడి పండ్లను పంపిస్తారు. ఈ లిస్ట్‌లో కమేడియన్ ఆలీ కూడా ఉన్నారు. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్‌కు ఆలీ మంచి మిత్రుడు. పవన్ నటించిన అనేక సినిమాలలో అతనికి ఓ మంచి రోల్ ఉంటుంది. మరి ఇంత దగ్గరి స్నేహితుడికి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపలేదట. ఈ విషయాన్ని ఆలీ స్వయంగా తెలియజేశాడు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఈ ఏడాది తనకు మామిడి పండ్లను పంపలేదని అతను చెప్పాడు. అలాగే చాలా మందికి కూడా ఈసారి పవన్ మామిడి పండ్లను పంపలేదని తెలిసింది.

Pawan Kalyan did not send mangoes to Comedian Ali

The post పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపలేదట.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.