చికిత్స పొందుతూ రోగి ఆత్మహత్య…

Patient suicide with Stomach pain

 

ఆదిలాబాద్‌: రిమ్స్‌లో చికిత్స పొందుతున్న తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి నారాయణ ఆసుపత్రి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. సూపరింటెండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ… నారాయణ మే 15వ తేదీన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ రిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులు సముదాయించినా వినకుండా కడుపు నొప్పిని భరించడం కష్టం కావడంతో తను చికిత్స పొందుతున్న మేల్ మెడికల్ వార్డు మూడవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భవనంపై నుంచి దూకడంతో మృతుని తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే రిమ్స్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఎంఐసీయూకు తరలించారు. విషయం తెలుసుకున్న రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్‌రెడ్డిలు వైద్యులను అప్రమత్తం చేసి చికిత్సలు ప్రారంభించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలసులు వెల్లడించారు.

Patient suicide with Stomach pain in Rims Hospital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చికిత్స పొందుతూ రోగి ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.