ఉత్తీర్ణత పెరిగింది

టెన్త్‌లో 92.43శాతం పాస్ 93.68%తో జగిత్యాల జిల్లాకు ప్రథమ స్థానం 89.09%తో హైదరాబాద్ జిల్లాకు చివరి స్థానం గత ఏడాది కంటే 8.65% అధికం బాలుర కంటే బాలికలదే 2.5%పైచేయి 4374స్కూళ్లలో 100% పాస్, 9 పాఠశాలల్లో జీరో శాతం జూన్ 10 నుంచి అడాన్స్‌డ్ సప్లిమెంటరీ మన తెలంగాణ/హైదరాబాద్: పదవ తరగతి ఫలితాల్లో ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ ఫలితాలలో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 83.78 శా తం […] The post ఉత్తీర్ణత పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
టెన్త్‌లో 92.43శాతం పాస్

93.68%తో జగిత్యాల జిల్లాకు ప్రథమ స్థానం

89.09%తో హైదరాబాద్ జిల్లాకు చివరి స్థానం

గత ఏడాది కంటే 8.65% అధికం
బాలుర కంటే బాలికలదే 2.5%పైచేయి
4374స్కూళ్లలో 100% పాస్, 9 పాఠశాలల్లో జీరో శాతం
జూన్ 10 నుంచి అడాన్స్‌డ్ సప్లిమెంటరీ

మన తెలంగాణ/హైదరాబాద్: పదవ తరగతి ఫలితాల్లో ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ ఫలితాలలో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 83.78 శా తం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 8.65 శాతం ఉత్తీర్ణత పెరిగింది. పదవ తరగతి వార్షిక పరీక్షలకు రెగ్యులర్‌గా 5,46,728 మంది విద్యార్థులు హాజరు కాగా, 5,06,202 మంది(92.43%) ఉ త్తీర్ణత సాధించారు. గత ఏడాది పదవ తరగతి పరీక్షలకు 5,01, 732 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 4,20,365 మంది (83.78 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పదవ తరగతిలో బాలికల ఉత్తీర్ణత 93.68 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 91.18 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత బాలుర కంటే 2.5 శాతం అధికంగా నమోదైంది. పదవ తరగతి ఫలితాలలో 93.68 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా,89.09 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాకులు బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ ఫలితాలలో ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత 56.53 శాతం నమోదైంది. ప్రైవేట్ విద్యార్థులు 40526 మంది పరీక్షలకు హాజరు కాగా, 22,910 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణతలో బాలుర ఉత్తీర్ణత 53.65 శాతం నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణత 61.40 శాతం నమోదైంది. బాలుర కంటే బాలికలు 7.75 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

తొమ్మిది స్కూళ్లలో సున్నా శాతం..
పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 4,374 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, తొమ్మిది పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదు ప్రైవేట్ పాఠశాలల్లో, రెండు జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఒక ప్రభుత్వ పాఠశాలలో, ఒక ఎడెడెడ్ పాఠశాలలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. 185 కెజిబివిల్లో, 97 మోడల్ స్కూళ్లు, 94 గురుకులాలు, 1580 జిల్లా పరిషత్ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు, 2279 ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బిసి గురుకుల పాఠశాలలు అత్యధికంగా 98.78 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 84.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బిసి గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల్లో రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

10 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి.విజయకుమార్ తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు మే 29 వరకు ఎస్‌బిఐ బ్యాంకు ట్రెజరీ బ్రాంచ్‌లలో ఫీజు చెల్లించాలని, మే 31 వరకు డిఇఒ కార్యాలయాలలో సమర్పించాలని, జిల్లా విద్యాశాఖాధికారులు జూన్ 3లోగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కార్యాలయంలో నామినల్ రోల్స్ సమర్పించాలని అన్నారు. రూ.50 అపరాధ రుసుంతో పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు అంటే జూన్ 8 వరకు ఫీజు కట్టవచ్చని తెలిపారు. ఈ పరీక్షలకు తక్కువ వ్యవధిలో నిర్వహించవలసి ఉన్నందున ఫెయిలైన విద్యార్థులు వారు పెట్టుకున్న రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా జూన్ 10 నుంచి జరుగనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కోల్పోవద్దని సూచించారు.

రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల గడువు
పదవ తరగతి మార్కుల రీ కౌంటింగ్, రీ వెఫికేషన్‌కు ఫలితాల వెలువడిన తేదీ నుంచి 15 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి. రీ కౌంటింగ్‌కు ఎఎస్‌బిఐ బ్యాంకు చలానా ద్వారా రూ.500 ఫీజు చెల్లించాలి. అలాగే అన్ని సబ్జెక్టులకు జవాబుపత్రాల పునఃపరిశీలన విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాలకు వికేంద్రీకరించారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సంబంధించిన ప్రధానోపాధ్యాయులచే ధృవీకరణ సంతకం చేయించి, హాల్ టికెట్ జిరాక్స్ ప్రతితోపాటుగా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో సమర్పించాలి. దరఖాస్తు ఫారం నమూనాను www.bse.telan gana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున వ్యక్తిగతంగా చలానా తీయాలి. ఇందులో గ్రేడ్ మారితేనే సవరించిన ధృవపత్రాలను జారీ చేస్తారు. జవాబుపత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు.

ఫిర్యాదులకు ప్రత్యేక యాప్
పదవ తరగతి విద్యార్థులు, పాఠశాలలు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఎస్‌ఎస్‌సి బోర్డు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి లేదా ప్లేస్టోర్ నుంచి టిఎస్‌ఎస్‌ఎస్‌సి బోర్డ్ యాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చుఏసి లాగిన్ కావాల్సి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్ నెంబర్ ఇస్తారు. అలాగే విద్యార్థులు తమ మొబైల్ నెంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి. మెయిల్ ఐడిని నమోదు చేసి సేల్ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్స్‌సెల్‌లోకి వెళ్‌లి దానిని సెలెక్ట్ చేసుకుని, టెక్ట్ బాక్స్‌లో ఫిర్యాదును రాసి సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు కన్‌ఫర్మేషన్ మేనేజ్ వస్తుంది. అయితే ఇందులో ఒకసారే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.

10 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు రాష్ట్ర సెకండరీ విద్య సంచాలకులు బి.సుధాకర్ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలలో ప్రభుత్వం సెలవులు ప్రకటించినా, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

Pass Percentage Increases, 92.43 Per Cent Pass

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉత్తీర్ణత పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: