ఎవరి లెక్కలు వారివి…

ఖమ్మం : రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గురువారం జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పోలీంగ్ సరళీని పరిశీలిస్తే ఈసారి గతంకంటే భిన్నమైన తీర్పు రాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు విభిన్నమైన తీర్పునిచ్చే ఈ జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పంధాను కొనసాగించినట్లు అంచనావేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో గురువారం పోలీంగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అభ్యర్ధులంతా లెక్కలతో […] The post ఎవరి లెక్కలు వారివి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి విలక్షణమైన తీర్పు ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గురువారం జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పోలీంగ్ సరళీని పరిశీలిస్తే ఈసారి గతంకంటే భిన్నమైన తీర్పు రాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు విభిన్నమైన తీర్పునిచ్చే ఈ జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పంధాను కొనసాగించినట్లు అంచనావేస్తున్నారు.
ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో గురువారం పోలీంగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అభ్యర్ధులంతా లెక్కలతో కుస్తీలు పడుతున్నారు బూత్‌ల వారిగా,గ్రామాల వారిగా,మండలాల వారిగా,పట్టణాల వారిగా,నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్ల లెక్కలను,పార్టీలవారిగా పోలైన ఓట్ల వివరాలను తెప్పించుకొని పోస్టుమార్టమ్ చేస్తున్నారు. కూడికలు, తీసివేతలతో కుస్తీలు పడుతున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ శాతంతో నేటి ఎన్నికల పోలీంగ్ శాతంతో పోల్చీతే కేవలం 10.55 శాతం ఓట్లు తగ్గాయి.2014 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చీతే 6.27 శాతం ఓట్లు తగ్గాయి. అయితే తగ్గిన ఓటింగ్ వల్ల ఎవ్వరికి నష్టం చేకురుతుందనే దానిపై కూడా వివిధ కొణాల్లో అంచనావేశారు. ఇలా అనేక రకాలుగా విశ్లేషణ చేసిన తరువాత ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇరు శిబిరాల్లో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండట గమనార్హం. అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖమ్మం పార్లమెంట్ స్ధానంలో గెలవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 50వేల లోపు మెజార్టీతో విజయం సాధిస్తామని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల మెజార్టీ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం ఎవ్వరికి మెజార్టీ రాకుండా ఇరువురికి సమానం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి, వైరాలో అత్యధిక మెజార్టీ లభిస్తుందని, పాలేరు, కొత్తగూడెంలో కూడా తమదే పై చెయ్యిగా ఉంటుందని టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో 20వేల నుంచి 60 వేల వరకు మెజార్టీ రావచ్చోవని వారు అంటున్నారు. కొత్తగూడెంలో ఒక నాయకుడు పోలీంగ్ చివరి రోజు ఆర్ధరాత్రి వరకు ససేమిరా అనడం వల్ల అక్కడ 20వేల వరకు రావాల్సిన మెజార్టీ 10వేలకు తగ్గిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్‌కు భారీ అధిక్యత లభించబోతున్నట్లు ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. మధిర నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్‌కు అనుకూలమైన వాతవరణం కన్పిస్తుంది. మధిర టౌన్ తో పాటు రూరల్ కూడా కారు కు మెజార్టీ రానున్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎర్రుపాలేం మండలం కాస్తా అటఇటూ మారినట్లు తెలుస్లోంది. పాలేరు ,వైరా నియోజకవర్గంలో ఉదయం మందకొడిగా పోలైన ఓట్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా పోల్ అయినప్పటికి మధ్యాహ్నం తరువాత పోలైన ఓట్లన్ని టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇక్కడ గెలుపు కోసం ముఖ్యనాయకులంతా కలిసికట్టుగా పనిచేయడం వల్ల విజయం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో మొదలుకొని సిట్టింగ్ ఎం పి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి,స్ధానిక ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఐక్యమత్యంతో కిలిసి పోరాడారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన స్ధానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సిట్టింగ్ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జలగం సోదరులు, పిడమర్తి రవి ,డాక్టర్ దయానంద్ తదితర ముఖ్యనేతలంతా ఈ ప్రాంతాకి చెందిన వారు కావడంతో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ పై ఆ పార్టీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. వీరంతా ఒకటై నామాను గెలిపించుకోవడానికి నడుం బిగించి పనిచేయడం వల్ల ఇక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి. మధిర నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి చివరిక్షణం వరకు శతవిధాలా ప్రయత్నించి అతి స్వల్ప మెజార్టీతో ఒడిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ భారీ అధిక్యతను సాధించే దిశగా ఈ ఎన్నికల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడ అధిక మెజార్టీ లభిస్తుందని భాస్తున్నారు.ఈ నియోజకవర్గంలో ఎర్రుపాలేం మండలంలో టిఆర్ ఎస్ అధిక్యతకు గండి పడే అవకాశం ఉంది.
ఇక పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో కింది స్దాయి కార్యకర్తలంతా తీవ్ర అగ్రహంతో ఉండటంతో ముందు అక్కడ ప్రతికూల వాతవరణం ఉంటుందని భావించినప్పటికి, పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ మొత్తం పరిస్థితినే తారుమారు చేసేసింది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పదివేల అధిక్యతపై నమ్మకం పెట్టకుంది. వైరా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పనిచేశారు. దీంతో ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ పదివేలకు పైగా ఆశలు పెట్టుకుంది. ఆశ్వారావుపేటలో టిడిపి ఎమ్మెల్యే ఉండటం వల్ల ముందుగా అక్కడ టిఆర్ఎస్‌కు మైనస్ ఓట్లు వస్తాయని అంతా భావించారు .కాని ఇప్పుడు మొత్తం పార్లమెంట్ పరిధిలోనే భారీ అధిక్యతను తీసుకొచ్చే సెగ్మెంట్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వర్‌రావు గెలుపు కోసం కృషి చేసిన నామ నాగేశ్వర్‌రావు ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మెచ్చా పిలుపు నివ్వడమే ఆయనకు అనుకూలంగా మారినట్లయింది. టిడిపి కార్యకర్తలంతా గతంలో నామతో ఉన్న పాత పరిచయం కొద్ది నామకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ దాదాపు 15వేల వరకు మెజార్టీ రావోచ్చని భావిస్తున్నారు. ఇక ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ అధిక్యత సాధిస్తారని అంతా భావించారు. స్ధానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కూడా చిత్తశుధ్ధితో భారీ అధిక్యత కోసం పనిచేశారు. కాని ఇక్కడ ఇరుపార్టీలకు సమానమైన ఓట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీనేతలే భావిస్తున్నారు. ఒక వేళ వచ్చిన మైనస్ ఓట్లు రావచ్చని కూడా భావిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ శిభిరం కూడా గెలపుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 5వేల నుంచి 35వేల లోపు మెజార్టీతో గెలుస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేయడం గమనర్హం. అశ్వారావుపేట,కొత్తగూడెం,వైరా,మధిరలో 4వేల నుంచి 12వేల వరకు మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వైరాలో 12వేలు, మధిరలో 10వేల అధిక్యత ఖాయమంటున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పదివేలు,సత్తుపల్లిలో 6వేలు,పాలేరులో 6వేల వరకు లోటు ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎవ్వరికి అంతుచిక్కని విధంగా ఓటరు తన దైన శైలీలో ఇవిఎం మీటాను గట్టిగా నొక్కారు. గెలుపు పై ఇరుపార్టీలు ధీమా గా ఉన్నప్పటికి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సిపిఎం,బిజెపి అభ్యర్ధులు కూడా ఘననీయమైన ఓట్లను పొందే అవకాశం ఉంది. ఆయా పార్టీలకు ఇక్కడ ఉన్న బలానికి మించి ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. అదేరితిలో నోటా కు కూడా భారీగా ఓట్లు పోలైనట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి 10.55శాతం ఓట్లు తగ్గాయి. తగ్గిన ఓట్లు ఎవ్వరికి లాభం చేకూర్చబోతుందనే దానిపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ తగ్గడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం అంటున్నారు. మొత్తం మీద ఖమ్మం ఫలితంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.ఈ సస్పెన్స్ తొలగాలంటే ఇంకా 41 రోజుల వరకు అగాల్సి ఉంటుంది.

Parties’ Postmortom on Khammam Loksabha Elections

The post ఎవరి లెక్కలు వారివి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: