కాంగ్రెస్‌కు క్లీయరైన అభ్యర్థులు

టిఆర్‌ఎస్ నుంచి ఫైనల్ కాని అభ్యర్థులు జోరుగా అనధికారికంగా అభ్యర్థుల పేరుతో ప్రచారాలు   మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాజీ పోలీస్ అధికారి పరకాలకు చెందిన దొమ్మాటి సాంబయ్యను అభ్యర్థిగా ఎఐసిసి ప్రకటించింది. అంతకుముందే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ను ప్రకటించింది. ఇద్దరి అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు పూర్తి స్థాయిలో […]

టిఆర్‌ఎస్ నుంచి ఫైనల్ కాని అభ్యర్థులు
జోరుగా అనధికారికంగా అభ్యర్థుల పేరుతో ప్రచారాలు

 

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాజీ పోలీస్ అధికారి పరకాలకు చెందిన దొమ్మాటి సాంబయ్యను అభ్యర్థిగా ఎఐసిసి ప్రకటించింది. అంతకుముందే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ను ప్రకటించింది. ఇద్దరి అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు పూర్తి స్థాయిలో అధిష్ఠానం ప్రకటించినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్‌ఎ అభ్యర్థుల లిస్ట్‌ను ముందస్తుగానే ప్రకటిస్తామనుకున్న కాంగ్రెస్ పొత్తుల కుంపటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి ప్రకటించడంతో క్లారిటీ లేక అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్దండులు, సీనియర్లను రంగంలోకి దింపాలన్న ఎఐసిసి ఆలోచన మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ అభ్యర్థులను రంగంలోకి దించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బలరాంనాయక్‌ను అధిష్ఠానం ప్రకటించింది. 2009లో మహబూబాబాద్ నుండి తొలిసారిగి ఎంపిగా పోటీ చేసిన బలరాంనాయక్ అనూహ్యంగా గెలిచారు. ఆయనకు కలిసొచ్చిన విధంగా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావడంతో బలరాంనాయక్ ఎస్టి సామాజిక వర్గం కావడం మరింత కలిసివచ్చింది. కేంద్ర, మంత్రివర్గ విస్తరణలో బలరాంనాయక్‌కు మంత్రి పదవీ రావడం వరంగల్ జిల్లాకు కలిసివచ్చిన అంశంగా మారింది. బలరాంనాయక్ కేంద్రమంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. మహారాష్ట్ర నుండి రేణిగుంట వరకు నిర్మిస్తున్న 365 హైవే రోడ్డు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వెళ్లే విధంగా బలరాంనాయక్ పాత్ర ప్రధానంగా ఉంది.

కేంద్రమంత్రిగా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వల్ల ఆయనకు ప్రజల్లో మంచి పేరే వచ్చింది. 2014 ఎన్నికల్లో అనూహ్య పరిణామాలతో ఆయన ఓటమిపాలయ్యారు. గడిచిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలరాంనాయక్‌కు టికెట్ రాదనుకున్న తరుణంలో ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆశీస్సులు బలరాంనాయక్‌కు నేరుగా ఉండడంతో ఆయనకు మొదటి విడత అభ్యర్థుల ప్రకటనలోనే టికెట్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా కొత్తగూడెం, భద్రాచలంలో టిఆర్‌ఎస్ హవానే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పినపాక, ఇల్లందు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ వర్గాలు షాక్ నుండి తేరుకోలేదు. ప్రస్తుతం బలరాంనాయక్‌కు పోటీ ఏటికి ఎదురీదినట్లుగానే ఉంది. రానున్న ఎన్నికల్లో బలరాంనాయక్‌కు ఉన్న మంచి పేరు అతని గెలిపిస్తుందా.. ఓడిస్తుందా.. అనేది చూడాలి. వరంగల్ పార్లమెంట్ స్థానానికి పరకాలకు చెందిన దొమ్మాటి సాంబయ్యను అధిష్ఠానం మంగళవారం ఖరారు చేసింది. సాంబయ్య మాజీ పోలీస్ అధికారి.

తెలుగుదేశం పార్టీలో చేరి పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మారుస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోలీస్ అధికారిగా మంచి పేరు ఉన్నప్పటికి రాజకీయాల్లో ఆయనకు ఇప్పటి వరకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ ఈక్వేషన్లను బట్టి గెలుపోటములు ఏవిధంగా ఉండాయనేది వేచిచూడాలి. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకు అధిష్ఠానం అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అనధికారికంగా మాత్రం వరంగల్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపిగా ఉన్న పసునూరి దయాకర్‌నే మళ్లీ కొనసాగిస్తారని దాదాపుగా అతనిపేరు ఖరారైనట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఆరుగురు ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్ నుండే గెలిచారు.

ఈసారి కూడా వారి ఆధ్వర్యంలో దయాకర్‌నే గెలిపించడానికి అవకాశాలు ఉండడం వల్లనే ఆయన పేరునే ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సిట్టింగ్‌గా ఉన్న అజ్మీరా సీతారాంనాయక్‌కు టికెట్‌ను ఖరారు చేయనట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో మహబూబాబాద్ మాజీ ఎంఎల్‌ఎ మాలోతు కవితను బరిలోకి దించుతున్నారు. ఇద్దరు అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయకపోయినప్పటికి నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ సమీక్ష సమావేశాల్లో ఇద్దరు అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ఖరారు చేసినట్లుగా చెపుతూ వారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలని క్యాడర్‌కు దిశ నిర్దేశాన్ని చేస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించే సారథులు వీరే..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇద్దరు నాయకులకు అధిష్ఠానం అప్పగించింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా, భూపాలపల్లి ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డిని నియమించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డిని నియమించారు. వీరిద్దరి ఆధ్వర్యంలో రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించడానికి రెండు నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులను సమన్వయ పరిచే బాధ్యత కూడా అప్పగించారు.

 

Parliament Elections: Congress Released Candidates List

 

Parliament Elections: Congress Released Candidates

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: