కేంద్రంలో టిఆర్‌ఎస్ చక్రం తిప్పడం ఖాయం

  నేరేడు చర్ల: దేశం మెచ్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో టిఆర్‌ఎస్ చక్రం తిప్పడం ఖాయామని నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జి రవీందర్‌రావు, టిఆర్‌యస్ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ టిఆర్‌యస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును కాంక్షిస్తూ నేరెడుచర్ల నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో […]

 

నేరేడు చర్ల: దేశం మెచ్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో టిఆర్‌ఎస్ చక్రం తిప్పడం ఖాయామని నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జి రవీందర్‌రావు, టిఆర్‌యస్ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ టిఆర్‌యస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును కాంక్షిస్తూ నేరెడుచర్ల నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సిఎం కెసిఆర్ సారధ్యంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్ధించాలన్నారు. అధికారం కోసమే జాతీయ పార్టీలని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా గ్రామాలలోకి ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని అన్నారు.

70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టిఆర్‌యస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేసిందని తెలిపారు. ఎంఎల్ఎగా గెలవకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పార్టీలో కష్టపడిన వారికి మంచి గుర్తింపు లభిస్తుందని, పార్టీని బూత్ స్థాయి నుండి పటిష్టం చేయడం కోసం ఆయా గ్రామాల్లో బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం సిపిఎం, టిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరగా రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, యమ్‌పి అభ్యర్ధి నర్సింహారెడ్డి సతీమణి ఇందిర, టిఆర్‌యస్ నాయకులు జిన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, చలసాని శ్రీనివాస్, చలసాని మాదవరావు, పల్వాయి కృష్ణమూర్తి, సుందీప్‌రెడ్డి,గౌస్, చింతమళ్ళ,సైదులు గౌష్, రాపోలు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Parliament Election Campaign in Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: