పకడ్భందీగా పరిషత్ కౌంటింగ్ నిర్వహించాలి…

  *రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి నాగర్‌కర్నూల్ : జడ్పిటిసి, ఎంపిటిసిల కౌంటింగ్ తేదీ నిర్వహించు కౌంటింగ్‌పై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ స్ట్రాం గ్ రూంల వద్ద భద్రతా బలగాల డబుల్ సెక్యూరిటి కవర్ పర్యవేక్షణ ఉండాలని ఓట్ల లెక్కిం పు ప్రక్రియ దశలో బ్యాలెట్ పేపర్లు సదరు బూ త్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని అన ంతరం ఎంపిటిసి, జడ్పిటిసి వారిగా విడదీసి […] The post పకడ్భందీగా పరిషత్ కౌంటింగ్ నిర్వహించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

*రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి

నాగర్‌కర్నూల్ : జడ్పిటిసి, ఎంపిటిసిల కౌంటింగ్ తేదీ నిర్వహించు కౌంటింగ్‌పై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ స్ట్రాం గ్ రూంల వద్ద భద్రతా బలగాల డబుల్ సెక్యూరిటి కవర్ పర్యవేక్షణ ఉండాలని ఓట్ల లెక్కిం పు ప్రక్రియ దశలో బ్యాలెట్ పేపర్లు సదరు బూ త్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని అన ంతరం ఎంపిటిసి, జడ్పిటిసి వారిగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు. రెండో దశలో ఎంపిటిసి ఎన్నికలకు కౌంటింగ్ మొదలుపెడుతారని ఒక్కో ఎంపిటిసి స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఉంటాయన్నారు. ఆ విధమైన ఏర్పాటు చేయాలని అధికారులకు కోరారు.

ప్రతి ఎంపిటిసి అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ ఓపెన్ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ము ందు చూపించాలని తెలిపారు. అభ్యంతరాలున్న బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారులతో తుది నిర్ణయం ఉంటుందన్నారు. ముందుగా ఎంపిటిసి స్థానాల్లో ఓట్లను లెక్కింపేందుకు ఏర్పాటు చేయాలని ఆ తర్వాత జడ్పిటి సి ఓట్లను లెక్కించేందుకు ఏర్పాటు చేయాలని కోరారు. ఒక రౌండ్ వెయ్యి ఓట్లతో లెక్కింపు ప్రారంభించాలని ఒక్కో స్థానానికి రెండు రౌండ్ల ఏర్పాటు చేయాల ని అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎస్‌జిటి ఉపాధ్యాయులు కౌంటింగ్‌కు నియమించి వారికి శిక్షణ ఇచ్చి కౌంటింగ్ పకడ్భందీగా నిర్వహించాలని అధికారులను సూచించారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది శిక్షణ అందించి 27వ తేదీ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, పంచాయతీ అధికారి సురేష్‌మోహన్, పరిషత్ ఎన్నికల నిర్వహణాధికారి మొగులప్ప తదిత రులు పాల్గొన్నారు.

Parishad Counting without any Disturbance

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పకడ్భందీగా పరిషత్ కౌంటింగ్ నిర్వహించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: