ధర్నా చేస్తుండగా పరిగి ఆర్‌టిసి డ్రైవర్ మృతి

Driver

 

పరిగి: వికారాబాద్‌లో మరో ఆర్‌టిసి డ్రైవర్ మృతి చెందాడు. పరిగి డిపో ఆర్‌టిసి డ్రైవర్ వీర భద్రయ్య గత కొన్ని రోజులు సమ్మెలో పొల్గొంటూ ఆరోగ్యాన్ని విస్మరించాడు. దీంతో శుక్రవారం భద్రయ్య ఆర్‌టిసి కార్మికులతో ధర్నా చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి భద్రయ్యను తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడు. దీంతో డ్రైవర్ మృతదేహంతో పరిగి డిపో ఎదుట ఆర్‌టిసి కార్మికులు ధర్నాకు దిగారు. బిజాపూర్-హైదరాబాద్ రహదారిపై కార్మికులు ధర్నా చేస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్మికులు, సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

 

Parigi RTC Driver Died with Ill in TSRTC Strike

 

RTC Driver Died in Strike in Vikarabad

The post ధర్నా చేస్తుండగా పరిగి ఆర్‌టిసి డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.