బహుశా ఈ కథలు మారొచ్చు…!

  “ ఎప్పుడూ ఆ ఫోన్లో ఛాటింగ్…. ఎవరితో? “ మనతో మాట్లాడేందుకు కబుర్లే ఉండవా? “ మన కంటే స్నేహితులే ఎక్కువా? ఇవే టీనేజర్లు ఉన్న ఇంట్లో వాళ్ల గురించి వినబడే కామెంట్లు. పిల్లల అవసరాలు, వాళ్ల అభిప్రాయాలు వాళ్ల ఆసక్తులూ అర్థం కా నంత వేగంగా మారిపోతూ ఉంటాయి. నిజానికి వాళ్ల శరీరంలో జరిగే మార్పులే వాళ్లకు అర్థంకాక చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటే కాలం కూడా పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ […] The post బహుశా ఈ కథలు మారొచ్చు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

“ ఎప్పుడూ ఆ ఫోన్లో ఛాటింగ్…. ఎవరితో?
“ మనతో మాట్లాడేందుకు కబుర్లే ఉండవా?
“ మన కంటే స్నేహితులే ఎక్కువా?
ఇవే టీనేజర్లు ఉన్న ఇంట్లో వాళ్ల గురించి వినబడే కామెంట్లు. పిల్లల అవసరాలు, వాళ్ల అభిప్రాయాలు వాళ్ల ఆసక్తులూ అర్థం కా నంత వేగంగా మారిపోతూ ఉంటాయి. నిజానికి వాళ్ల శరీరంలో జరిగే మార్పులే వాళ్లకు అర్థంకాక చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటే కాలం కూడా పిల్లల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది.

“ ఏమిటీ ఉత్తరాలు? నీ మెయిల్ చెక్ చేశాను ఎవరితో నువు వ్యవహారం నడుపుతున్నావు.
“ నువ్వెవరు నా లెటర్స్ సంగతి అడగడానికి. నా మెయిల్స్ దొంగతనంగా ఎందుకు చూశావు? నా ఇష్టం నాకు అతనంటే చాలా ఇష్టం. ఐ లవ్ హిమ్’
“ నువ్వు ఒంటిపైన తెలివి ఉండే మాట్లాడుతున్నా వా? ఇప్పుడు ప్రేమేమిటి? నువు ఇంజనీరింగ్ రెం డో ఏడు. వాడు మూడోదా ఫైనల్ ఇయరా? ఏం చేస్తారు? చదువు మానేసి ఎట్లా బతుకుతారు. వా డు నీకు పూటకు అన్నం అయినా పెట్టగలడా?
“అవును ప్రేమే. అతను హృదయ పూర్వకంగా ప్రేమిస్తున్నాడు. నా కన్నీ అతనే. అతనితో నేను సంతోషంగా ఉంటాను” “ అయ్యో… నీ కేదో పిచ్చి పట్టింది ఇప్పుడు ప్రేమా పెళ్లి ఏమిటీ?
“ ఎస్. మేం పెళ్లి చేసుకుంటాం”
“ ఇదేంటమ్మా…. నువ్వు కూడా.

పిల్లలు ఇట్లా తయారయ్యారు అంటే కౌన్సిలింగ్ అంటావు… ఇప్పుడు వాళ్లను వదిలేసి మాకు కౌన్సిలింగ్ ఏమిటీ?”
“నేను సరిగ్గా చెప్పాను. నీకు తల్లిని కాదా? నువు, నీ భర్తా నాకు తెలియదా? మీ ఇద్దరూ ఇం టిని పిల్లల్ని పట్టించుకున్నారా? లక్షలకి లక్షలకు ఎట్లా ఆర్జించాలా అని లెక్కలు, సరుకులు వీకెం డ్లు, పార్టీలు, నగలు కొనటం తప్ప నీ ఇంట్లో ఇర వై ఏళ్ల పిల్లవాడి మనసు ఎటు ఎందుకు పోతుందో కనిపెట్టావా? నీ దగ్గర దొరకని దేదో వాళ్ల స్నేహితుల దగ్గర వెతుక్కున్నాడు.
వాళ్లకి ప్రేమ కావాలి. వాళ్లకి సమానంగా గౌరవించే దగ్గరతనం కావాలి. వాళ్లని అ ర్థం చేసుకోవాలి. నీకు సమయం ఉందా”
“ అయితే ఏమిటి ఇది నా తప్పేనా?

“ కచ్చితంగా ఇది నీ తప్పే. ఒక తల్లిగా పదహారు దాటుతున్న పిల్లవాడిని ఐదేళ్లవాడిలాగా ట్రీట్ చే స్తూ, వాడిని ఎంగేజ్ చేసేందుకు విలువైన వస్తువు లు కొని ఇవ్వటం మాత్రమే ప్రేమ అనుకున్నావు. వాడు బొమ్మకాదు. వాడికి నిజంగా మనసుని అర్థం చేసుకునే ఫ్రెండ్ వంటి అమ్మానాన్నా కావా లి. వాడికి సమయం ఇవ్వాలి. వారిని సరిగ్గా పెంచాలి”
టీనేజర్లతో వాళ్ల తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయంపై వాళ్ల వ్యక్తిత్వ నిర్మా ణం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెప్పా రు. ఒక వయసు వాళ్లకి వాళ్లే అర్థం కారు. ఎన్నో విలాసవంతమైన ఆకర్షణలు మనసులో లాగుతుంటాయి. ఇంకో వైపు భవిష్యత్తును చక్కగా నిర్మించుకునే అవకాశాలు కన్పిస్తూ ఉంటాయి.

వాళ్లు ఎటువైపు ఆకర్షితులౌతారు. వా ళ్లపైన స్నేహితులు ఇరవై నాలుగు గంటలు వేళ్ల చివర్ల నడిచే సోషల్ మీడియా అంతులేని ఇన్‌ఫర్‌మేషన్, అన్నీ తెలుసనే గర్వం, పరిసరాలు, ఇంకోవైపు వయసు ప్రభావం, కొత్తగా కలుగుతున్న లైం గిక పరమైన కోరికలు, మరీ కొత్తగా అనుభవంలో ని వచ్చే శరీరం వాళ్లను అతలాకుతలం చేస్తాయి.
లోకమే కొత్తగా ఉత్తేజ భరితంగా అనిపిస్తుంది. వాళ్లు వెంటనే షేర్ చేయగలిగే దగ్గరగా అనిపించిన వ్యక్తులతో ప్రేమలో పడిపోతారు. అవతలివాళ్ల చదువు, ఉద్యోగం, సోషల్ సెక్యూరిటీ, భవిష్యత్తు ఇవేవీ లెక్కలోకి రావు. తమను ఆకాశం అంత ఎత్తున కూర్చోబెట్టి ముద్దుచేసే, గౌరవించే ఒక ఆకర్షణలో సులువుగా పడిపోతారు.

పిల్లలు కాలేజీకి సరిగ్గా వెళ్లటం లేదు మార్కులు తక్కవగా వస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు. ఏమవుతుం ది అన్న సందేహం వస్తే రుజువులు, సాక్షాలు కనిపిస్తే, వాళ్ల భవిష్యత్తు ఒడిదుడుకులకు లోనవుతుంది అనిపిస్తే, పరిధి దాటుతున్నారు అనుకుంటే తల్లిదండ్రులు వాళ్లను అదుపులో పెట్టొ చ్చు, జాగ్రత్తలు చెప్పొచ్చు.
మార్గ నిర్దేశకత్వం చేయచ్చు. కానీ వాళ్ల జీవితంలో కల్పించుకోవటం అన్న విషయం చాలా సున్నితంగా జరగాలి. ఘర్షణలు అరుపులు వృథానే. వాళ్లను రెచ్చగొట్టిన కొద్దీ ఇంకా వ్యతిరేకత పెంచుకుంటారు. తెలివైన జనరేషన్ కాబట్టి ఎ లాంటి ఇన్‌ఫర్‌మేషన్ లేకుండా జాగ్రత్త పడతారు. చేతులు పూర్తిగా జారిపోయినా తల్లిదండ్రులు ఏ మాత్రం తెలుసుకోలేరు.

అందుకే పిల్లలతో స్నేహపూర్వకంగా ప్రేమతో మెలగటం పెద్దవాళ్లే అలవర్చుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని విమర్శించటం వాళ్లపైన రు ద్దటం వంటివి చేస్తే పిల్లలు పేరెంట్స్‌ని నమ్మటం మానేస్తారు. పిల్లలు పుట్టగానే వాళ్లు అచ్చం మన లా ఉన్నారని, వాళ్లు మన కలలకు ప్రతిరూపాలని అనుకున్నట్లే వాళ్లు ఎదిగినా అనుకోవాలి. హఠాత్తు గా వాళ్లకు పెద్దరికం ఇచ్చి, వాళ్లు మన ఇష్టం వచ్చినట్టు వినటం లేదని ఇగోతో రగిలిపోకూడదు. వా ళ్లు సవ్యమైన దారిలో నడిచేలా వాళ్లు నడిచే దారి లో ముళ్లూ, రాళ్లూ లేకుండా జాగ్రత్త పడాలి. టీనేజ్‌లో లవ్ చాలా సామాన్యం. ఆ ఉద్రేకాన్ని అర్థం చేసుకుని, వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పుకుని దారి లో తెచ్చుకోవాలి.

టీనేజ్ పిల్లలు ఎంతో కొంత బాధ్యతారాహిత్యంతో ఉంటారు. అది కేవలం వాళ్ల అనుభవరాహిత్యం మాత్రమే. తల్లిదండ్రులు తగు మా త్రంగా పట్టించుకుని, సమయం సందర్భం చూసి హెచ్చరించి మార్చుకోవాలి.
వాళ్లకి తల్లిదండ్రుల ప్రేమ పుష్కలంగా దక్కాలి. నా గురించి మా పేరెంట్స్‌కి మాత్రమే తెలుసు. వాళ్లు నా మేలు కోరేవాళ్లు నా భవిష్యత్తు వాళ్ల చేతుల్లో భద్రంగా ఉంటుంది అన్న భరోసా పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగితే బ హుశా ఈ టీనేజ్ లవ్‌స్టోరీస్‌లో కాస్త మార్పు రావచ్చు.

 

Parents should be Care about Teenage Childrens

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బహుశా ఈ కథలు మారొచ్చు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: