వరకట్నం ఇవ్వలేక కన్న కూతురుపై హత్యాయత్నం

  నల్గొండ : కన్న కూతుర్నే చంపేందుకు ప్రయత్నించిన అత్యంత విషాద ఘటన జిల్లాలోని చోటు చేసుకుంది. మునుగోడు నియోజకవర్గంలోని వెలగలగూడెం గ్రామానికి చెందిన కవితన (32) పిజి చదివింది. తన తల్లిదండ్రులు కొన్నేళ్లుగా ఆమెకు వివాహం చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో కవిత ఎప్పటికైన తన పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ తన తల్లిదండ్రులతో చెప్పడంతో కవితపై కోపం పెంచుకున్నారు. బాధితురాలి కుటుంబానికి ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో రెండు ఎకరాలు […] The post వరకట్నం ఇవ్వలేక కన్న కూతురుపై హత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్గొండ : కన్న కూతుర్నే చంపేందుకు ప్రయత్నించిన అత్యంత విషాద ఘటన జిల్లాలోని చోటు చేసుకుంది. మునుగోడు నియోజకవర్గంలోని వెలగలగూడెం గ్రామానికి చెందిన కవితన (32) పిజి చదివింది. తన తల్లిదండ్రులు కొన్నేళ్లుగా ఆమెకు వివాహం చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో కవిత ఎప్పటికైన తన పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ తన తల్లిదండ్రులతో చెప్పడంతో కవితపై కోపం పెంచుకున్నారు. బాధితురాలి కుటుంబానికి ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో రెండు ఎకరాలు తన వివాహనికి కట్నంగా రాయాలని డిమాండ్ చేయడంతో, పెళ్లికి భూమి రిజిస్ట్రేషన్ చేయమని తెల్చిచెప్పారు.

ఇదిలా ఉండగా తాజాగా.. కవితకు వివాహం చేస్తే… కట్నం ఇవ్వాల్సి వస్తుందని… చంపేందుకు తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి పథకం వేశారు. ఆమెను బండరాళ్లతో తీవ్రంగా కొట్టారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆస్తి వివాదం, కట్నం సమస్య ఆమె ప్రాణాలకు శాపంగా మారాయి. బాధితురాలి తల్లి, అన్నయ్య పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.

Parents murder attempt on daughter in Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరకట్నం ఇవ్వలేక కన్న కూతురుపై హత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: