హిస్టారికల్ విజువల్ వండర్

Panipat movie

 

మూడవ పానిపట్ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్’. అశుతోష్ గోవర్‌కర్ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్, రోహిత్ షీలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్ పార్వతీబాయిగా, సంజయ్‌దత్ ఆహ్మద్ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

‘అహ్మద్ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్ క్యారెక్టర్‌ని చూపించారు. ఇక ఆయన బాడీలాంగ్వేజ్ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది. విజువల్స్, రీరికార్డింగ్, ఆర్ట్ వర్క్‌కి అద్భుతమైన వస్తోంది. హిస్టారికల్ విజువల్ వండర్‌గా రూపొందిన ‘పానిపట్’ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అజయ్-అతుల్, కెమెరా : సి.కె.మురళీధరన్, ఎడిటింగ్ : స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ చంద్రకాంత్ దేశాయ్, యాక్షన్ : అబ్బాస్ అలీ మొఘల్.

Panipat movie Historical Visual Wonder

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హిస్టారికల్ విజువల్ వండర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.