టిఆర్‌ఎస్‌లోకి పాలేరు ఎంఎల్‌ఎ…!

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో  కాంగ్రెస్ ఎంఎల్ఎ టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి  తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన కందాళ ఉపేందర్‌ రెడ్డి టిఆర్ఎస్ లో చేరనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఉపేందర్ రెడ్డి  గురువారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో భేటీ అయ్యారు. వీరు పలు అంశాలపై చర్చించారు.  వచ్చే […]

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో  కాంగ్రెస్ ఎంఎల్ఎ టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి  తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన కందాళ ఉపేందర్‌ రెడ్డి టిఆర్ఎస్ లో చేరనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఉపేందర్ రెడ్డి  గురువారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో భేటీ అయ్యారు. వీరు పలు అంశాలపై చర్చించారు.  వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఇస్తామని కెటిఆర్ ఉపేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన టిఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అవసరమైతే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి టిఆర్ ఎస్ బి ఫారంపై పోటీచేసే ఆలోచనలో ఉపేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్‌, చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరారు.  మహేశ్వరం ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి, ఆమె కొడుకు కార్తీక్‌ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సబిత, కార్తీక్ కెటిఆర్, సిఎం కెసిఆర్ తో పాటు మహేశ్వరం మాజీ ఎంఎల్ఎ తీగల కృష్ణారెడ్డితో వరుస భేటీలు నిర్వహించారు. టిడిపి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు.

Paleru Congress MLA Upender Reddy Joins TRS

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: