సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ఇక నడిపేది లేదు:పాకిస్తాన్

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ గురువారం ప్రకటించారు. అయితే పాకిస్తాన్ నుంచి లాంఛనంగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదీ వెలువడలేదని భారత అధికారులు తెలిపారు. వాఘా సరిహద్దు వద్ద రైలును నిలిపివేశారని, అక్కడి నుంచి భారత్‌కు ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. కాగా, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వాఘా నుంచి బయల్దేరిందని, అట్టారీకి ఆ రైలు వస్తుందని భారత రైల్వే […] The post సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ఇక నడిపేది లేదు:పాకిస్తాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ గురువారం ప్రకటించారు. అయితే పాకిస్తాన్ నుంచి లాంఛనంగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదీ వెలువడలేదని భారత అధికారులు తెలిపారు. వాఘా సరిహద్దు వద్ద రైలును నిలిపివేశారని, అక్కడి నుంచి భారత్‌కు ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. కాగా, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వాఘా నుంచి బయల్దేరిందని, అట్టారీకి ఆ రైలు వస్తుందని భారత రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ట్వీట్ చేశారు. ఇలా ఉండగా, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సర్వీసును రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, తాను రైల్వే మంత్రిగా కొనసాగినంత కాలం ఆ రైలు నడవదని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ చెప్పినట్లు రాయ్‌టర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

Pakistan says Samjhauta express cancelled, Indian railway officials said that the train will come to Attari station from Wagah

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ఇక నడిపేది లేదు:పాకిస్తాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: