భారత్‌తో మాకు ముప్పు

కశ్మీర్‌పై అంతర్జాతీయంగా లభించని మద్దతు యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది  ప్రపంచం దృష్టిని మళ్లిస్తోంది  మీడియాతో పాకిస్థాన్ ప్రధాని  మా వ్యవహారాలు మీకెందుకు? పాక్ వ్యాఖ్యలకు స్పందించిన భారత్ ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచం దృష్టిని కశ్మీర్ సమస్య నుంచి దారి మళ్లించేందుకు భారతదేశం యుద్ధ వాతావరణాన్ని పోలిన పరిస్థితిని సృష్టిస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. గురువారం నాడు ఎంపిక చేసిన జర్నలిస్టుల బృందంతో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘ముప్పు ఉన్న మాట నిజమే. అలాంటి పరిస్థితికి […] The post భారత్‌తో మాకు ముప్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కశ్మీర్‌పై అంతర్జాతీయంగా లభించని మద్దతు

యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది
 ప్రపంచం దృష్టిని మళ్లిస్తోంది
 మీడియాతో పాకిస్థాన్ ప్రధాని
 మా వ్యవహారాలు మీకెందుకు?
పాక్ వ్యాఖ్యలకు స్పందించిన భారత్

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచం దృష్టిని కశ్మీర్ సమస్య నుంచి దారి మళ్లించేందుకు భారతదేశం యుద్ధ వాతావరణాన్ని పోలిన పరిస్థితిని సృష్టిస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. గురువారం నాడు ఎంపిక చేసిన జర్నలిస్టుల బృందంతో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘ముప్పు ఉన్న మాట నిజమే. అలాంటి పరిస్థితికి మనం స్పందించాలి. ఇండియా తప్పుడు చర్యలకు పాల్పడుతోంది. ఇందువల్లే దేశాల మధ్య యుద్ధాలు మొదలు కావడం మనం చూశాం’ అని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో రాసిన ఒక అంశాన్ని ఉదహరిస్తూ చెప్పారు. ‘మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన రుచించని భారత్ కశ్మీర్‌ను ప్రత్యేక ప్రతిపత్తి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది.

భారతదేశంతో సంబంధాల్ని తిరిగి మామూలు పరిస్థితికి తీసుకొచ్చేందుకు మేము చాలా కష్టపడ్డాం. కానీ వాళ్లు (ఇండియా) పుల్వామా దాడిని తమ ఎన్నికలకు వాడుకున్నారు. ఆర్థికంగా కూడా మమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో వేసేందుకు ఇండియా లాబీయింగ్ చేస్తోం ది. మేము యుద్ధం కోరుకోవడం లేదు. కానీ కశ్మీర్‌లో ఏం జరుగుతున్నదీ ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఇమ్రాన్‌ఖాన్ వివరించారు. ఇలా ఉండగా..ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే తమ సమాధానం చాలా తీవ్రంగా ఉంటుందని పాకిస్థాన్ మిలిటరీ భారత్‌ను హెచ్చరించింది.
పాక్‌కు ఇది మామూలే
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్య గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్‌ను అడగ్గా ‘పాకిస్థాన్ ఈ సమయంలో మారిన పరిణామాల్ని గుర్తించాలి. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. యుద్ధ వాతావరణం ఉందని అంతర్జాతీయ సమాజం అనుకోవడం లేదు. కానీ వాళ్లు ఒక భయానక పరిస్థితిని కల్పించాలనుకుంటున్నారు. ఇదొక కుట్ర’ అని వ్యాఖ్యానించారు.

pakistan pm imran khan comments on jammu and kashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్‌తో మాకు ముప్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: