యాంకర్ కాల్చివేత

కరాచీ : పాక్ లో ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ ను దుండగుడు బుధవారం ఉదయం కాల్చి చంపాడు. ఖయబన్-ఇ-బుఖారీ ప్రాంతంలో కేఫ్ వద్ద కారులో ఉన్న మురీద్ అబ్బాస్‌పై  అతీఫ్ జమాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మురీద్ అబ్బాస్ బోల్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షతోనే అబ్బాస్ హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ […] The post యాంకర్ కాల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరాచీ : పాక్ లో ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ ను దుండగుడు బుధవారం ఉదయం కాల్చి చంపాడు. ఖయబన్-ఇ-బుఖారీ ప్రాంతంలో కేఫ్ వద్ద కారులో ఉన్న మురీద్ అబ్బాస్‌పై  అతీఫ్ జమాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మురీద్ అబ్బాస్ బోల్ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్నారు. వ్యక్తిగత కక్షతోనే అబ్బాస్ హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబ్బాస్ స్నేహితుడు ఖిజార్ హయత్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అబ్బాస్, అతడి స్నేహితుడిపై కాల్పులు  జరిపిన దుండగుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఛాతీలో కాల్చుకోవడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా మారిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Pakistan news anchor shot dead

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యాంకర్ కాల్చివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.