పాక్ భారీ ఊబకాయుడు నూరుల్ హస్సన్ మృతి

  లాహోర్: పాకిస్థాన్ భారీ ఊబకాయుడు(330కిలోల బరువు) 55ఏళ్ల నూరుల్ హస్సన్ సోమవారం మృతి చెందాడు. ఇటీవలనే ఆయనకు లిపోసక్షన్ సర్జరీ జయప్రదంగా జరిగింది. సర్జరీ తరువాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనను పరిశీలనలో ఉంచారు. అయితే ఆస్పత్రిలో చెలరేగిన సిబ్బంది ఆందోళన కారణంగా ఆయనకు గంట వరకు ఎలాంటి వైద్యచికిత్స అందకపోవడంతో అస్వస్థతకు గురై చనిపోయాడు. హస్సన్‌తో పాటు మరో మహిళా రోగి కూడా వైద్యం అందక ఆస్పత్రి లో చనిపోయింది. మహిళా రోగి తాలూకు […] The post పాక్ భారీ ఊబకాయుడు నూరుల్ హస్సన్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లాహోర్: పాకిస్థాన్ భారీ ఊబకాయుడు(330కిలోల బరువు) 55ఏళ్ల నూరుల్ హస్సన్ సోమవారం మృతి చెందాడు. ఇటీవలనే ఆయనకు లిపోసక్షన్ సర్జరీ జయప్రదంగా జరిగింది. సర్జరీ తరువాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనను పరిశీలనలో ఉంచారు. అయితే ఆస్పత్రిలో చెలరేగిన సిబ్బంది ఆందోళన కారణంగా ఆయనకు గంట వరకు ఎలాంటి వైద్యచికిత్స అందకపోవడంతో అస్వస్థతకు గురై చనిపోయాడు. హస్సన్‌తో పాటు మరో మహిళా రోగి కూడా వైద్యం అందక ఆస్పత్రి లో చనిపోయింది. మహిళా రోగి తాలూకు బంధువులు కిటికీలు పగుల గొట్టి, వెంటిలేటర్లను స్విచ్‌ఆఫ్ చేశారని, డాక్టర్లపై దాడికి పాల్పడ్డారని ఆస్పత్రి సిబ్బంది ఆరోపించారు.

దాంతో ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగడంతో రోగులకు తక్షణ వైద్యం అందకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేక నూరుల్ హస్సన్, మరో మహిళా రోగి మృతి చెందారని డాక్టర్ మాజుల్ హస్సన్ చెప్పారు. భారీ ఊబకాయుడు నూరుల్ హస్సన్ లాహోర్‌కు 400 కిమీ దూరంలో సాదికాబాద్‌లో ఉండేవాడు. ఆయనను పాకిస్థాన్ హెలికాఫ్టర్‌లో లాహోర్‌కు తీసుకు వచ్చి వైద్యం చేయడం ప్రారంభించారు. ఊబకాయాన్ని తగ్గించే శస్త్ర చికిత్స జూన్ 28న ఆయనకు జరిగింది.

Pakistan heaviest man dies in Lahore hospital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్ భారీ ఊబకాయుడు నూరుల్ హస్సన్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.